TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు లేటెస్ట్ అప్‌డేట్, రేపు ఉదయం 11 గంటలకు tsbienew.cgg.gov.in/, results. cgg.gov.in, examresults.ts.nic.in ద్వారా ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ బోర్డు దీనిపై ఆదివారం ప్రకటన చేసింది. ఫలితాలను ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం (జూన్ 28న) విడుదల (Inter results) కానున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు దీనిపై ఆదివారం ప్రకటన చేసింది. ఫలితాలను ఈ నెల 28న ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫలితాలను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in లో చూడాలని ఆమె కోరారు.
మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. అందులో 4,42,767 మంది సెకండియర్ విద్యార్థులు, 4,64,626 మంది ఫస్టియర్ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరంతా ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాల్లో పరీక్షలు రాశారని చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి గురైనా, ఇతర సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నం.18005999333ను సంప్రదించవచ్చని మంత్రి సూచించారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రెండూ ఒకేసారి విడుదలవుతాయి.
ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోనే.. ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు అందరూ కలిసి దాదాపు 9 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాల్ని తెలుసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే.