TS SSC Marks Memo: పదవ తరగతి విద్యార్థుల మార్కులు వచ్చేశాయి, www.bse.telangana.gov.inలోకి వెళ్లి గ్రేడింగ్‌ వివరాలు పొందవచ్చు

ఈ వివరాలను www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో మార్చి 2020 ఏడాది పాసయిన వారంతా (Telangana SSC March 2020) మెమోలు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు తీసుకోవచ్చని చెప్పారు

AP 10th Class Exams Cancelled. Representational Image. |(Photo Credits: PTI)

Hyderabad, June 22:తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు (TS SSC Marks Memo) ఖరారయ్యాయి. ఈ వివరాలను www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో మార్చి 2020 ఏడాది పాసయిన వారంతా (Telangana SSC March 2020) మెమోలు ఆయా పాఠశాలల్లో విద్యార్థులు తీసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, కింది వెబ్‌సైట్ల ద్వారా హాల్‌టికెట్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను చెక్ చేసుకోండి

ఏవైనా పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్సెస్సీ బోర్డుకు పంపాలని సూచించారు. కాగా, మార్చిలో జరిగిన పరీక్షలు కరోనా వైరస్‌ ప్రభావంతో వాయిదా పడగా, ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. అంతర్గత మూల్యాంకనం మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

పదో తరగతి విద్యార్థులు తమ తమ గ్రేడ్లను చూసుకునేందుకు మొదట bse.telangana.gov.inలోకి లాగినై, టీఎస్‌ ఎస్సెస్సీ గ్రేడ్‌లు 2020 క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఫలితాల పేజీ వస్తుంది. అనంతరం హాల్‌ టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేసి సబ్మిట్‌ చేస్తే గ్రేడింగ్‌ను చూపిస్తుంది. వీటిని ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులకు గ్రేడ్‌ కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.