7 learning and education apps offering free access during the coronavirus lockdown| (Photo Credits: PTI)

Hyderabad, June 18: తెలంగాణ రాష్ట్రంలో మార్చిలో నిర్వహించిన ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్ష ఫలితాలు (Manabadi TS Inter Result 2020) గురువారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.50 లక్షలమంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ప్రక్రియకు బోర్డు దరఖాస్తులు చేసుకోవడానికి రెండు వారాల వరకు గడువు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై 11 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించే అవకాశం ఉన్నది. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, ప్రథమ, ద్వీతీయ సంవత్సరాల ఫలితాలు ఒకే రోజు విడుదల, పాసయ్యారో లేదో చెక్ చేసుకోవడం ఎలా ?

మరోవైపు ఇంటర్మీడియట్‌ ఫలితాలు (TS Intermediate Results 2020) వెలువడిన వెంటనే విద్యార్థులకు ఫలితాల (విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకునే వెబ్‌ కాపీ)తోపాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్‌ మెసేజ్‌ పంపిస్తామని డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. తెల్లవారే ప్రవేశాల నోటిఫికేషన్‌ జారీచేస్తామన్నారు.

ఈ కింది వెబ్‌సైట్లలో హాల్‌టికెట్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలను చూసుకోవచ్చు.

1. https://tsbie.cgg.gov.in/

2. http://manabadi.co.in/

3. https://www.manabadi.com/

వీటితో పాటు గూగుల్ ప్లే స్టోర్‌లో TSBIE m-Services అనే యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చు.

తెలంగాణ ఇంటర్మీడియట్ తొలి సంవత్సర ఫలితాల్లో 2.88 లక్షలమంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 60.10 శాతం మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారని విద్యాశాఖ మంత్రి తెలిపారు. తొలి సంవత్సరాల ఫలితాల్లో బాలికలదే పై చేయి అని వివరించారు. 67.4 శాతం బాలికలు ఉతీర్ణత సాధించారని, బాలురు 52.30 శాతం మంది పాసయ్యారని తెలిపారు.

రెండవ సంవత్సర ఫలితాల్లో 2.83 లక్షల మంది ఉతీర్ణత సాధించారని మంత్రి తెలిపారు. రెండో సంవత్సర ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి అని అన్నారు. 71.75 శాతం బాలికలు ఉతీర్ణత సాధించారని, బాలురు ఉతీర్ణత శాతం 62.10గా నమోదైందని మంత్రి అన్నారు. తొలి సంవత్సర ఫలితాల్లో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా రెండో సంవత్సర ఫలితాల్లో కొమరంభీం జిల్లా తొలి స్థానంలో నిలిచిందని తెలిపారు.