UPSC Result 2021 Declared: సివిల్స్‌ సర్వీసెస్‌-2021 ఫలితాలు విడుదల, 685 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ బోర్డు, ఈ సారి నలుగురు టాపర్లు అమ్మాయిలే

అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ బోర్డు. సివిల్స్‌ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా (UPSC Result 2021 Declared) చాటారు.

Shruti Sharma (Photo Credits: Twitter)

సివిల్స్‌ సర్వీసెస్‌-2021 ఫలితాలు ఇవాళ (సోమవారం) ఉదయం విడుదల అయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ బోర్డు. సివిల్స్‌ సర్వీసెస్‌లో ఈసారి అమ్మాయిలు హవా (UPSC Result 2021 Declared) చాటారు. నలుగురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. 2021 సివిల్స్‌ పరీక్షల్లో టాపర్‌గా నిలిచింది శృతి శర్మ. రెండో ర్యాంకర్‌గా అంకితా అగర్వాల్‌, మూడో ర్యాంకర్‌ గామిని సింగ్లా నిలిచారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్‌కుమార్‌ రెడ్డికి 15వ ర్యాంక్‌ దక్కింది. పూసపాటి సాహిత్యకు జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్‌, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంక్‌, రవికుమార్‌కు 38వ ర్యాంక్‌, కొప్పిశెట్టి కిర్మణయికి 56వ ర్యాంక్‌ దక్కింది. పాణిగ్రహి కార్తీక్‌కు 63వ ర్యాంక్‌, గడ్డం సుధీర్‌కుమార్‌కు 69వ ర్యాంక్‌, శైలజ 83వ ర్యాంక్‌, శివానందం 87వ ర్యాంక్‌, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్‌, అరుగుల స్నేహకు 136వ ర్యాంక్‌, గడిగె వినయ్‌కుమార్‌ 151 ర్యాంక్‌, దివ్యాన్షు శుక్లాకు 153వ ర్యాంక్‌, కన్నెధార మనోజ్‌కుమార్‌కు 157వ ర్యాంక్‌, బొక్కా చైతన్య రెడ్డికి 161వ ర్యాంక్‌, దొంతుల జీనత్‌ చంద్రకు 201వ ర్యాంక్‌, అకవరం సాస్యరెడ్డికి సివిల్స్‌ జాతీయ స్థాయిలో 214వ ర్యాంక్‌ దక్కాయి.



సంబంధిత వార్తలు

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ షురూ.. రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే హవా.. కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే (లైవ్)

Assembly Election Result 2024: మ‌హారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కౌంటింగ్ కు స‌ర్వం సిద్ధం, వ‌య‌నాడ్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి, కౌంటింగ్ కు సంబంధించి పూర్తి వివ‌రాలివే

Jharkhand Exit Poll Result 2024: జార్ఖండ్‌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, ఓటర్లు ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపారంటున్న సర్వేలు

Maharashtra Exit Poll Result 2024: ఇండియా కూటమికి షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ కూటమి, పూర్తి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో..