AP Inter Academic Calendar 2023-24: జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం, రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు
రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
ఏపీలో వేసవి సెలవులు అనంతరం జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌కి 227 పని దినాలుగా ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు
►జులై 24 నుంచి 26 వరకు యూనిట్-1 పరీక్షలు
►ఆగస్ట్ 24 నుంచి 26 వరకు యూనిట్ -2 పరీక్షలు
►సెప్టెంబర్ 16 నుంచి 23 వరకు క్వార్టర్లీ పరీక్షలు
►అక్టోబర్ 16 నుంచి 18 వరకు యూనిట్ -3 పరీక్షలు
►అక్టోబర్ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు
►నవంర్ 23 నుంచి 25 వరకు యూనిట్ -4 పరీక్షలు
►డిసెంబర్ 18 నుంచి 23 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు
►2024 జనవరి 11 నుంచి 17 వరకు ఇంటర్ కళాశాలలకి వేసవి సెలవులు
►2024 ఫిబ్రవరి రెండవ వారంలో ఇంటర్ ప్రాక్టికల్స్
►2024 మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు
►2024 మార్చ్ 28 చివరి వర్కింగ్ డే
►2024 మార్చ్ 29 నుంచి మే 31 వరకు వేసవి సెలవులగా అకడమిక్ క్యాలెండర్ విడుదల