Goods Trains Collide: బెంగాల్ లో రైలు ప్రమాదం, సిగ్నలింగ్ వ్యవస్థలో లోపంతో ఢీకొన్న గూడ్స్ రైళ్లు, ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ మరువక ముందే మరో ఘటన
ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైళ్లు ఢీకొని 283 మంది మరణించిన దుర్ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మళ్లీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు గూడ్స్ రైళ్లు (Goods Trains Collide) ఢీకొన్నాయి.
Kolkata, June 25: పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రంలో ఆదివారం రెండు గూడ్స్ రైళ్లు (Goods Trains Collide) ఢీకొనడంతో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైళ్లు ఢీకొని 283 మంది మరణించిన దుర్ఘటన జరిగిన నెల రోజుల తర్వాత మళ్లీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండు గూడ్స్ రైళ్లు (Goods Trains Collide) ఢీకొన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా (Bankura) రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఢీకొనడంతో వాటికి చెందిన పలు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఒండా రైల్వేస్టేషనులో జరిగిన ఈ దుర్ఘటనలో ఓ గూడ్స్ రైలుకు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలు డ్రైవరుకు స్వల్ప గాయాలయ్యాయి.
ఖాళీగా ఉన్న రెండు గూడ్స్ రైళ్లు ఎలా ఢీకొన్నాయో స్పష్టంగా తెలియలేదని రైల్వే అధికారులు చెప్పారు. ఈ రైలు ప్రమాదంతో ఆద్రా రైల్వే డివిజన్ లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఆద్రా రైల్వే డివిజన్ పశ్చిమ మిడ్నాపూర్, బంకురా, పురూలియా, బుర్ద్వాన్, జార్ఖండ్ లోని ధన్ బాద్, బొకారో, సింగ్భూమ్ జిల్లాలకు రైలు సేవలు అందిస్తోంది. ఈ ప్రమాదం వల్ల పలు జిల్లాల్లో రైళ్లు అన్ని నిలిచిపోయాయి. పురూలియా ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు.