Covid in India: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకుంటున్న ఇండియా, తగ్గుముఖం పడుతున్న కేసులు, తాజాగా ,11,170 మందికి కరోనా, 3,62,437 మంది డిశ్చార్జ్, కరోనా సెకండ్‌వేవ్‌పై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కీలక వ్యాఖ్యలు
వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,62,437 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077కు (Covid in India) చేరింది.
New Delhi, May 16: భారత్‌లో నిన్న కొత్తగా 3,11,170 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,62,437 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,46,84,077కు (Covid in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 4,077 మంది కరోనా కారణంగా మృతి (Covid Deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,70,284కు పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,07,95,335 మంది కోలుకున్నారు. 36,18,458 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 18,22,20,164 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 31,48,50,143 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,32,950 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
తమిళనాడు రాష్ట్రంలో కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరుకుంది. గత 25 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 లక్షల పాజిటివ్ కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. అదే సమయంలో చెన్నైలో గత రెండు రోజులుగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గింది. ఇది నగర వాసులకు కాస్త ఊరట కలిగించే విషయం. మరోవైపు కోయంబత్తూరులో కూడా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలోని అన్ని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో నిండిపోయాయి. దీంతో కరోనా వైరస్ బారినపడినవారిని వారివారి ఇళ్ళలోనే హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
తాజాగా కరోనా సెకెండ్ వేవ్ కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం కరోనా కేసుల సంఖ్య గత వారం రోజులుగా తగ్గుముఖం పడుతోంది. పాజిటివిటీ రేటు కూడా 20 శాతానికన్నా తగ్గింది. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా కాస్త తగ్గింది. అయితే కరోనా మృతుల సంఖ్యలో పెద్దగా తేడా కనిపించడం లేదు. మృతుల సంఖ్య శనివారం మరోసారి నాలుగు వేలు దాటింది. గ్రామీణ భారతదేశంలో కరోనా పరిస్థితులు మరింతగా క్షీణిస్తున్నాయి. కరోనా టెస్టుల సంఖ్య కూడా తగ్గింది. గడచిన ఏడు రోజుల కేసులను పరిశీలిస్తే సుమారు 50 వేల వరకూ కేసులు తగ్గాయి. మే 8 న 3.91 లక్షల కేసులు నమోదు కాగా, శనివారం నాటికి ఈ సంఖ్య 3.54 లక్షలకు పడిపోయింది. దీనిని గమనించిన నిపుణులు కరోనా సెకెండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతున్నదని భావిస్తున్నారు.
దేశంలో కరోనా వైరస్ ప్రస్తుత ఉద్ధృతికి ప్రభుత్వ, ప్రజల నిర్లక్ష్యమే కారణమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ‘పాజిటివిటీ అన్‌లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కరోనా మొదటి ఉద్ధృతి తర్వాత ప్రజలు, ప్రభుత్వాల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందని, ప్రస్తుత పరిస్థితికి అదే కారణమని అన్నారు. కరోనా సెకండ్ వేవ్ రాబోతోందని మనకు తెలుసని, మరోవైపు వైద్యులు కూడా హెచ్చరించారని, అయినప్పటికీ మనం నిర్లక్ష్యాన్ని వీడలేదన్నారు.
ప్రస్తుత పరిస్థితికి ఒకరినొకరు నిందించుకోవడం మాని పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారిపై పోరు విషయంలో ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాలని ఆరెస్సెస్ సీనియర్ నేత, బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పేర్కొన్నారు.