Shakuntala Gaikwad: అంత్యక్రియల వేళ..పాడె మీద నుంచి పెద్దగా ఏడుస్తూ లేచిన కరోనా సోకిన వృద్ధురాలు, ఒక్కసారిగా షాక్ అయిన బంధువులు, మహారాష్ట్రలో బారామతిలో ఘటన, శకుంతల గైక్వాడ్‌ చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని తెలిపిన వైద్యులు
Representational Image (Photo Credits: Twitter)

Mumbai, May 15: మహారాష్ట్రలో కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలికి (Shakuntala Gaikwad) అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ వృద్ధురాలి (76-year-old Covid positive woman) పాడెపై నుంచి ఏడుస్తూ కళ్లు (wakes up minutes before cremation in Baramati) తెరిచింది. దీంతో బంధువులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. బామ్మ బతికిందని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బామ్మ ఆస్పత్రిలో ఉంది. ఈ సంఘటన మహారాష్ట్రలో బారామతిలో చోటుచేసుకుంది.

అక్కడి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముధాలేలోని బారామతి గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్‌ (76)కు మే 10వ తేదీన కరోనా సోకిందని తేలింది. దీంతో ఇంట్లో హోం ఐసొలేష‌న్‌లో ఉంచారు. అమె ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ నెల 10న కారులో బారామ‌తిలోని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అయితే ప‌డ‌క‌లు లేక‌ అడ్మిట్ చేసుకోలేదు.దీంతో కారులోనే చాలాసేపు వేచి ఉన్నారు. ఈ సమయంలో బామ్మ శకుంతల అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమెలో చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె మృతి చెందిందని భావించారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు.

మమతా బెనర్జీ ఇంట్లో విషాదం, సీఎం మమతా బెనర్జీ సోదరుడు కరోనాతో కన్నుమూత, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ఆషీమ్‌ బెనర్జీ

ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. శకుంతల మృతదేహాన్ని పాడెపై ఉంచి బంధవులంతా ఏడుస్తుండగా అకస్మాత్తుగా శకుంతల ఏడుస్తూ కళ్లు తెరిచింది. ఒక్కసారిగా కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. బామ్మ చనిపోలేదు.. బతికే ఉందని భావించి ఒక్క క్షణం తర్వాత తేరుకుని ఆనందపడ్డారు. వెంటనే ఆమెను బారామతిలోని సిల్వర్‌ జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు.కాగా, ఆ వృద్ధురాలు చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు.