శుక్రవారం నుంచి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను బతికించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆషీమ్ తుదిశ్వాస విడిచినట్లు మెడికా ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ అలోక్ రాయ్ తెలిపారు
కాగా సీఎం మమతాకు ఆరుగురు సోదరులు కాగా.. ఆశిం బెనర్జీ చిన్నవాడు. వీళ్లందరూ కోల్‌కతాలోని కాళీఘాట్‌లో నివాసంలోనే ఉంటారు. ఇక కోవిడ్ నిబంధనల ప్రకారం ఆషీమ్ అంత్యక్రియలను శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రోజు కొత్తగా 20,846 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,94,802కు చేరింది. మరణాల సంఖ్య 12,993కు పెరిగింది. ఆషీమ్ బెనర్జీ మరణంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ సంతాపం ప్రకటించారు.
Here's Ashok Gehlot Tweet
My heartfelt condolences on the untimely demise of Shri Ashim Banerjee, brother of West Bengal CM Mamata Banerjee ji (@MamataOfficial). My thoughts and prayers are with the bereaved family...may God give them strength to bear this loss and may the deaprted soul rest in peace.
— Ashok Gehlot (@ashokgehlot51) May 15, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)