Job Portal from AICTE: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల కోసం ఏఐసీటీఈ కెరీర్ పోర్టల్ ప్రారంభం.. https://student-career-portal.aicte-india.org/ లో రిజిస్టర్ అవ్వండి మరి!!
ఏటా 20 లక్షల మంది కొత్తగా ఇంజినీరింగ్ పట్టా అందుకొంటున్నారు.
Newdelhi, May 26: దేశంలో ఐఐటీల్లో (IIT) చదివిన విద్యార్థులకే ఉద్యోగాలు (Jobs) దొరకని పరిస్థితి తలెత్తింది. ఏటా 20 లక్షల మంది కొత్తగా ఇంజినీరింగ్ పట్టా (Engineering Degree) అందుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) (AICTE) కాస్త ఊరట కల్పించే ప్రయత్నం ప్రారంభించింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు, ఇంటర్న్ షిప్ లు పొందేందుకు ఉపయోగపడేలా ‘అప్న’ ప్లేస్‌మెంట్ ఏజెన్సీతో కలిసి స్టూడెంట్ కెరీర్ పోర్టల్ ను ప్రారంభించింది.
ఢిల్లీలో ఘోరం.. అర్ధరాత్రి పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం.. ఏడుగురు నవజాత శిశువుల మృతి (వీడియో)
ఇదే పోర్టల్..
ఇందులో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని తమ నైపుణ్యాలకు తగ్గ ఉద్యోగాలు వెతుక్కునేందుకు అవకాశం ఉంటుంది. https://student-career-portal.aicte-india.org/ ద్వారా ఈ పోర్టల్ ను వినియోగించుకోవచ్చు. నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే ఫ్లిప్ కార్ట్, పే టీఎం వంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది.