DGCA New Guidelines: విమానాలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ఎయిర్ లైన్స్ రద్దు చేయవచ్చు.. విమాన టికెట్ పైనే ఈ విషయం ముద్రణ.. ఇటీవల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసిన డీజీసీఏ
సోమవారం నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను (ఎస్‌వోపీ) జారీ చేసింది.
Newdelhi, Jan 16: విమానాల ఆలస్యం (Flights Delay), రద్దుకు (Cancel) సంబంధించి ఇటీవల వరుసగా ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ-DGCA) రంగంలోకి దిగింది. సోమవారం నూతన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను (ఎస్‌వోపీ-SOP) జారీ చేసింది. ఫ్లైట్ సర్వీసు 3 గంటల కంటే ఎక్కువ సమయం ఆలస్యమైతే ఆ విమానాన్ని ఎయిర్‌లైన్స్ సంస్థ రద్దు చేసేందుకు డీజీసీఏ వీలు కల్పించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందస్తుగానే రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఎందుకు తీసుకొచ్చారు?
ఎయిర్ పోర్టుల వద్ద రద్దీ నియంత్రణ, ప్రయాణికులకు వీలైనంతగా అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా డీజీసీఏ దీనిని రూపొందించింది. అయితే విమానం రద్దయితే ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త మార్గదర్శకాలలో భాగంగా విమాన టిక్కెట్ల పై సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్‌ను (CAR) ముద్రిస్తారు.