FASTags with incomplete KYC to be deactivated post Jan 31: NHAI

New Delhi, Jan 15: ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) KYC అసంపూర్తిగా ఉన్న ఫాస్ట్‌ట్యాగ్‌ అకౌంట్లను డీయాక్టివేట్ చేస్తామని తాజాగా ప్రకటించింది. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేస్తామని తెలిపింది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం (NHAI on FASTags Without KYC Link) తీసుకున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది.

NHAI విడుదల చేసిన ప్రకటన ప్రకారం KYC జనవరి 31 నాటికి పూర్తి కాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నా.. అలాంటి వాటిని డీయాక్టివేట్ లేదా బ్లాక్ లిస్ట్‌లో పెట్టే అవకాశం ఉంది. సదరు వినియోగదారుడు తమ ఫాస్ట్‌ట్యాగ్‌ డీ యాక్టివేట్ కాకుండా ఉండాలంటే జనవరి 31 లోపల కేవైసీ చేయించుకోవాల్సిందేనని ప్రకటనలో తెలిపింది.

ఫాస్టాగ్‌ స్కాన్‌ చేసి డబ్బులు కొట్టేయడం అసాధ్యం, ఆ బుడ్డోడి వీడియో ఫేక్, క్లారిటీ ఇచ్చిన NPCI,పేటీఎం సంస్థలు, ఫాస్టాగ్‌ వ్యక్తికి, వ్యక్తికి మధ్య జరిగే ట్రాన్సాక్షన్‌ కాదని వెల్లడి

కొందరు ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ పలు వాహనాలను వినియోగిస్తున్నట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇలాంటి వాటిని అరికట్టడానికి 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారుడు KYC చేసుకోవాల్సిందే. ఇది మాత్రమే కాకుండా కొందరు కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేస్తున్నారు. ఈ విధానికి కూడా జనవరి 31 తరువాత మంగళం పడనున్నారు.