AP Village Volunteer 2nd Notification: ఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి రెండవ నోటిఫికేషన్, మొత్తం 9 వేల 674 పోస్టులు, నవంబర్ 01వ తేదీ నుంచి భర్తీ ప్రక్రియ, డిసెంబర్ 01 నుంచి విధుల్లోకి
మొత్తం 9 వేల 674 వాలంటీర్ల పోస్టుల భర్తీకి 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
Amaravathi, October 26: ఏపీలో గ్రామ వాలంటీర్ల భర్తీకి రెండవ నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 9 వేల 674 వాలంటీర్ల పోస్టుల భర్తీకి 2019, అక్టోబర్ 26వ తేదీ శనివారం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ 01వ తేదీ నుంచి భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. నవంబర్ 10 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 15 నుంచి దరఖాస్తులను అధికారులు పరిశీలించి16 నుంచి 20 వరకు అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేస్తారు. ఇప్పటికే మొత్తం లక్షా 92 వేల 964 గ్రామ వాలంటీర్ల పోస్టులకు గాను లక్షా 83 వేల 290 మంది విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 9 వేల 674 పోస్టులు మిగిలిపోయాయి. జిల్లాల వారీగా ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి వేర్వేరుగా నోటిఫికేషన్‌లను జారీ చేస్తారని తెలుస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన వారికి 2019, నవంబర్ 22వ తేదీన సమాచారం పంపుతారు. వీరికి శిక్షణ నవంబర్ 29, నవంబర్ 30 తేదీల్లో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు డిసెంబర్ 01 నుంచి విధులు నిర్వహిస్తారు.
ప్రధాన తేదీల వివరాలు
1 Notification inviting applications 01-11-2019
2 Receipt of application 01-11-2019 to 10-11-2019
3 Scrutiny of applications By 15-11-2019
4 Interviews by Selection Committee 16-11-2019 to 20-11-2019
5 Intimation letters to selected Volunteers 22-11-2019
6 Induction and Training Programme 29-11-2019 to 30-11-2019
7 Positioning of volunteers 01-12-2019
విద్యార్హతలు
కనీస విద్యార్హత పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదవ తరగతి. 01.11.2019 నాటికి వయస్సు 18-35 సంవత్సరాలు ఉండాలి, ధరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయ్యి ఉండాలి. విలేజ్ వాలంటీర్ గా దరఖాస్తు చేయబోవు అభ్యర్థులకు ఆధార్ తప్పని సరి… ఒక వేళా ఆధార్ లేని పక్షం లో మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకొని 10 రోజులలో ఆధార్ ను జత చేయవలెను.OC తప్ప మిగతా కులాల వాళ్ళు కుల దృవీకరణ పత్రములో నెంబర్ ఎంటర్ చేసి VERIFY చేసుకొని కుల దృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాలి.