APPSC Recruitment 2022: ఏపీలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, మొత్తం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ, అర్హతలు, నియామక ప్రక్రియ వివరాలు మీకోసం

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఒక ప్రకటన (APPSC Recruitment 2022) జారీచేశారు.

Image used for representational purpose. (Photo Credits: PTI)

ఏపీలో కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఒక ప్రకటన (APPSC Recruitment 2022) జారీచేశారు. రెవెన్యూ శాఖలోని 670 జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టులు (Jr Assistant & Executive Officer posts), దేవదాయ శాఖలోని 60 ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకోసం కమిషన్‌ నోటిఫి కేషన్‌ జారీచేసినట్టు తెలిపారు. డిసెంబర్‌ 30 నుంచి 2022 జనవరి 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కార్యదర్శి సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి (AP Govenment) చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. ఏపీ రెవెన్యూ, ఏపీ ఎండోమెంట్స్‌ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 730. ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌(రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌) పోస్టులు 670 ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జిల్లా కలెక్టర్‌ నిర్వహించే కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్టు ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. వయసు18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌) కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

మీరిచ్చిన ప్రతి పైసాకు లెక్క ఉంది, సిగ్గు లేకుండా బ్రాందీ బుడ్డి 75 రూపాయలకే ఇస్తామంటున్నారు, ముందు పెట్రోల్‌, డీజీల్‌ రేట్లపై మాట్లాడండి, బీజేపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు మండిపాటు

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–3(ఎండో మెంట్స్‌ సబ్‌ సర్వీస్‌) పోస్టులు 60 ఉన్నాయి. ఈ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామినేషన్‌) కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

►దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

►ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.12.2021

►ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022

►వెబ్‌సైట్‌: https://psc.ap.gov.in