Adhikmas In Hindu Calendar: హిందూ పంచాంగంలో వచ్చే ఏడాది 13 నెలలు.. అధికంగా వచ్చిన ‘శ్రావణం’.. 19 సంవత్సరాలకు ఒకసారి ఇలా..

వచ్చే ఏడాది అంటే 2023లో 13 నెలలు ఉండనున్నాయి. ఆ ఏడాది శ్రావణ మాసాలు రెండు ఉండనున్నాయి. శ్రావణమాసం అధికంగా రానుండటమే ఇందుకు కారణం.

Credits: Facebook

Hyderabad, Dec 19: హిందూ పంచాంగం (Hindu Panchang) ప్రకారం.. వచ్చే ఏడాది అంటే 2023లో 13 నెలలు (13 Months) ఉండనున్నాయి. ఆ ఏడాది శ్రావణ మాసాలు (Sravana masam) రెండు ఉండనున్నాయి. శ్రావణమాసం అధికంగా రానుండటమే ఇందుకు కారణం. ఒక ఏడాది ఇలా 13 నెలలు (అధిక మాసం) రావడం 19 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఇంగ్లిష్ కేలెండర్ ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 16 వరకు అధిక శ్రావణమాసం ఉంటుంది.

మహారాష్ట్రలో దారుణం.. 16 ఏళ్ల బాలికపై 15 గంటలపాటు 8 మంది అత్యాచారం

ఎందుకు ఇలా?

సౌరమాన, చంద్రమాన పంచాంగాల ప్రకారం రోజుల లెక్కింపులో ఉన్న తేడాల కారణంగానే ఇలా అధికమాసం వస్తుంది. సౌరమానం ప్రకారం ఏడాదికి 365 రోజుల 6 గంటలు. చంద్రమానం ప్రకారమైతే ఏడాదికి 354 రోజులే ఉంటాయి. ఏడాది లెక్కింపులో ఉండే ఈ తేడాలను అధికమాసం రూపంలో ప్రతీ 19 ఏండ్లకు ఒకసారి సరిచేస్తుంటారు.

ఫిఫా వరల్డ్ కప్‌ మరోసారి అర్జెంటీనా కైవసం, ఫుల్ కిక్కిచ్చిన ఫైనల్ మ్యాచ్, షూటవుట్‌తో దుమ్మురేపిన అర్జెంటీనా, మెస్సీకి విక్టరీతో ఘన వీడ్కోలు