Bank Strike 2021: బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవ్వండి, వచ్చే వారం 5 రోజులు బ్యాంకులకు సెలవులు, రెండు రొజుల పాటు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు
దీంతో ఆ రెండు రోజులు (Bank unions call for strike on March 15 -16) బ్యాంకు సేవలకు అంతరాయం కలగొచ్చొని స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India (SBI) సమాచారం ఇచ్చింది. అలాగే రాబోయే వారం రోజుల్లో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
New Delhi, Mar 10: బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు దేశవ్యాప్తంగా మార్చి 15, 16 తేదీల్లో అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ రెండు రోజులు (Bank unions call for strike on March 15 -16) బ్యాంకు సేవలకు అంతరాయం కలగొచ్చొని స్టాక్ ఎక్స్‌ఛేంజీలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India (SBI) సమాచారం ఇచ్చింది. అలాగే రాబోయే వారం రోజుల్లో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.
మార్చి 11న శివరాత్రి సందర్భంగా బ్యాంకులకు సెలవు. మార్చి 13న రెండో శనివారం, మార్చి 14న ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. మార్చి 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా బ్యాంకుల్లో కార్యకలాపాలకు ఆటంకం తప్పదు. అంటే వచ్చేవారంలో బ్యాంకు కార్యకలాపాలు మార్చి 12, మార్చి 17న మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఖాతాదారులు బ్యాంకు లావాదేవీలు, ఇతరత్రా పనుల కోసం వెళ్లాలని అనుకుంటే ఈ సెలవులకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం మంచిద్ర్దని అధికారులు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ప్రసంగంలో పెట్టుబడుల ఉప సంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, సాధారణ భీమా సంస్థను ప్రైవేటీకరణ చేయనున్నట్లు ప్రకటించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెను ప్రకటించాయి.
రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ( UFBU) ఆధ్వర్యంలోనే తొమ్మిది యూనియన్లు సమ్మె నిర్వహించబోతున్నట్టు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రకటించింది. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కెనెరా బ్యాంక్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ (INBEF), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO), ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ కెనెరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AINBOF) ఈ సమ్మెలో పాల్గొంటాయి.