Rail Madad Helpline Number: రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం, అన్ని ఫిర్యాదులకు ఇకపై 139 నంబర్ మాత్రమే ఉపయోగించాలి, మిగతా నంబర్లు పనిచేయవని స్పష్టం చేసిన ఇండియన్ రైల్వే
Indian Railways| (photo-ANI)

New Delhi, Mar 9: రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం వివిధ నంబర్లు డయల్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే నంబర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ అన్ని నంబర్లకు (Rail Madad Helpline Number) బదులు ‘139’ నంబర్ డయల్ చేస్తే సరిపోతుంది. ఫలితంగా రైలు ప్రయాణికులు ఇకపై హెల్ప్‌లైన్ నంబర్లన్నింటినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.

ప్రయాణికులు ‘139’ నంబరుకు డయల్ చేసి రైల్వే ప్రయాణానికి సంబంధించిన ఏ ఫిర్యాదునైనా తెలియజేయవచ్చు. ఈ నూతన హెల్ప్‌లైన్ ( Railways helpline number) వినియోగంలోకి రావడంతో మిగిలిన హెల్ప్ లైన్ నంబర్లు ఇక పనిచేయవని రైల్వేశాఖ తెలిపింది. ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయడానికి లేదా విచారణ వివరాలను తెలుసుకోవడానికి స్మార్ట్‌ఫోనే అవసరం లేదు.

#OneRailOneHelpline139 హ్యాష్ ట్యాగ్‌తో ప్రత్యేకంగా సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను సైతం రైల్వే అధికారులు చేపట్టారు. 139 నంబర్‌పై (Railway Enquiry-139) ప్రజలకు అవగాహన కల్పించడానికి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్ మొత్తం 12 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయంలో ఎదురయ్యే సమస్యలు ఎలాంటివైనా తమ వివరాలను తెలియజేస్తూ.. 139 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా ఎస్ఎంఎస్‌ను పంపించవచ్చు.

కరోనాపై తప్పుడు సమాచారం ఇవ్వకండి, కేంద్రంపై మండిపడిన ఐఎంఏ, దేశంలో తాజాగా 15,388 మందికి కరోనా పాజిటివ్, 77 మంది మృతితో 1,57,930కు చేరిన మొత్తం మరణాల సంఖ్య

139 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయదలిచిన ప్రయాణికులు ఇంటారిక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) లేక స్టార్ బటన్‌ ద్వారా డయల్ చేయడానికి వీలు కల్పించారు. దీనికోసం స్మార్ట్‌ఫోనే అవసరం లేదని వివరించారు. ఎలాంటి హ్యాండ్‌సెట్ ద్వారానైనా ఈ నంబర్‌కు డయల్ చేసే అవకాశం ఉంది.

ఈ నంబర్ ద్వారా సహాయం కోరదలిచిన ప్రయాణికులు 139 నంబర్‌ను డయల్ చేసిన అనంతరం ఐవీఆర్ఎస్ సూచించిన విధంగా తమ మొబైల్ ఫోన్లలో అంకెలను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. భద్రత లేదా వైద్య పరమైన సహాయం కోసం 1, పీఎన్ఆర్ స్టేటస్, రైళ్ల రాకపోకలు, బెర్త్ కర్ఫర్మేషన్, టికెట్ ధర, టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సలేసన్, వేకప్ అలారం, డెస్టినేషన్ అలర్ట్, వీల్ ఛైర్ బుకింగ్, భోజనాన్ని ఆర్డర్ చేయానికి సంబంధించిన వివరాల కోసం 2 నొక్కాల్సి ఉంటుంది.

సాధారణ ఫిర్యాదుల కోసం 4, విజిలెన్స్ సంబంధిత ఫిర్యాదుల కోసం 5ను ప్రెస్ చేయాలి. పార్సెల్ అండ్ సరుకు రవాణాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి 6, ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాల కోసం 7, తమ ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి 9ని ప్రెస్ చేయాలని అధికారులు సూచించారు. నేరుగా కాల్ సెంటర్‌ సిబ్బందితో మాట్లాడటానికి స్టార్ బటన్‌ను నొక్కాలని అన్నారు.

మ‌రోసారి ల‌క్ష‌లాది ట్రాక్ట‌ర్ల‌తో పార్లమెంట్‌ను ముట్టడిస్తాం, డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని రైతు సంఘాల నేతలు హెచ్చరిక, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌పై మండిపడిన బీకేయూ నేత రాకేశ్‌ తికాయిత్

ఇక దేశంలోని రైల్వే స్టేష‌న్ల‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌రకు ఆ టికెట్ ధ‌ర‌ రూ.10గా ఉంది. రైల్వేశాఖ ఒకేసారి రూ.20 పెంచి ఆ టికెట్ ధ‌ర‌ను రూ.30గా నిర్ణ‌యించింది. పెంచిన ధ‌ర‌ల‌ను వెంట‌నే అమ‌ల్లోకి తీసుకురావాల‌ని అన్ని జోన్ల‌నూ ఆదేశించింది. ప్లాట్‌ఫాం టికెట్ తీసుకున్న వారు రెండు గంట‌ల పాటు ప్లాట్‌ఫామ్‌పై ఉండ‌వ‌చ్చు.

మ‌రోవైపు, లోక‌ల్ రైళ్ల టికెట్ల‌ను కూడా భారీగా పెంచుతూ రైల్వే శాఖ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. లోక‌ల్ రైళ్ల‌లో క‌నీస చార్జీ రూ.30గా నిర్ణ‌యించారు. దేశంలో క‌రోనా విజృంభ‌ణ పెరిగిపోతోన్న నేప‌థ్యంలో అన‌వ‌స‌ర ప్ర‌యాణాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి చార్జీల‌ను పెంచుతున్న‌ట్లు రైల్వే శాఖ చెప్పుకొచ్చింది. లోక‌ల్ రైళ్లు, ప్లాట్‌ఫాం‌పై ఎక్కువ మందిని ప్రోత్స‌హించ‌కుండా ఉండ‌డం కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పింది.

మూడు నెలల పాటు 3 ఉచిత సిలిండర్లు, ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద అందించే యోచనలో ప్రభుత్వం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే అవకాశం

ఇక ముంబాయి మెట్రో పాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లోని కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లలో ప్లాట్‌ఫాం టికెట్‌ ధఱను రూ.10 నుంచి ఏకంగా రూ.50 వరకు పెంచుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జనం అధిక రద్దీని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముంబాయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌, లోక్‌మాన్ తిలక్‌ టెర్మినల్‌తో పాటు పొరుగున ఉన్న ఠానే, కల్యాణ్‌,పాన్‌వెల్‌, భీవాండీ రోడ్‌ రైల్వే స్టేషన్‌లో పెంచిన ఈ ధరలు అమలు చేయనున్నట్లు సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పీఆర్వో శివాజీ సుతార్‌ పేర్కొన్నారు.

పెంచిన ప్లాట్‌ ఫాం టికెట్‌ ధరలు మార్చి 1 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు అమలులో ఉంటాయని ఆయన వెల్లడించారు. వేసవి ప్రయాణాల సందర్భంగా ఆయా స్టేషన్‌ల వద్ద అధిక రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.