Visakha RK BEach (Photo-K R Deepak ( @krdeepu18) )

కొత్త సంవత్సరం వచ్చేసింది ఈ ఏడాది ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా అయితే డిసెంబర్ 31వ తేదీ వేడుకల కోసం మీరు చక్కటి బీచ్ కి వెళ్లి సంబరాలు జరుపుకోవాలి. అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు బీచ్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ఈ సముద్రపు బీచ్లు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రధాన రహదారులతో కనెక్టివిటీతో ఉన్నాయి. ఇక్కడ మంచి హోటల్స్ అదేవిధంగా రవాణా సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి సముద్రపు బీచ్ ల గురించి తెలుసుకుందాం.

ఆర్కే బీచ్: విశాఖపట్నంలో ఉన్న రామకృష్ణ బీచ్ చాలా ఫేమస్ బీచ్ అని చెప్పవచ్చు. విశాఖ వాసులకు ఆర్కే బీచ్ ఒక వరం అనే చెప్పవచ్చు ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి మీరు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని అనుకున్నట్లయితే ఆర్కే బీచ్ సమీపంలో ఉన్న అనేక హోటల్స్ లో ఎంచక్కా మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించవచ్చు. అలాగే విశాఖపట్నంలో పలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి వాటిని కూడా మీరు జనవరి ఒకటో తేదీ విజిట్ చేయవచ్చు.

భీమిలి బీచ్: ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి 24 కి.మీ.ల దూరంలో ఉన్న గోస్తని నది సమీపంలో ఉంది. కొత్త సంవత్సరం వేడుకలను మీరు ఎంచక్కా సముద్రపు ఒడ్డున ఎంజాయ్ చేస్తూ గడపవచ్చు.

ఈ రెండు రోజుల్లో తులసి మొక్కకి నీళ్లు అసలు పెట్టవద్దు

సూర్యలంక బీచ్: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల పట్టణానికి సమీపంలో ఉన్న సూర్యలంక బీచ్ చాలా ఫేమస్. ప్రకృతి రమణీయతకు ఇది ఎంతో పెట్టింది పేరు. గుంటూరు పట్టణం అలాగే విజయవాడ పట్టణానికి కూడా ఇది ఎంతో సమీపంలో ఉంది. హైదరాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది. హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న బీచ్ ఇదే కావడం విశేషం.

మంగినపూడి బీచ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం నుండి 11 కిమీ దూరంలో మంగినపూడి వద్ద ఉంది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఇది చక్కగా అనువైనది. విజయవాడ పట్టణానికి కూడా ఇది సమీపంలోనే ఉంటుంది. ఈ బీచ్ లో పర్యటకులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి.

మైపాడు బీచ్ : నెల్లూరుకు తూర్పుగా 25 కిలోమీటర్ల దూరంలో మైపాడు వద్ద ఉన్నది. ఈ బీచ్ నూతన ఏడాది వేడుకల కోసం పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.ఏపీ టూరిజం సంస్థం వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్స్ వంటి వాటిని అభివృద్ధి చేయటం ద్వారా, వినోద కార్యకలాపాలను ఏర్పాటు చేయటం ద్వారా మైపాడు బీచ్ ను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది.