Cyclone Nivar Live Tracker: తుఫాన్ సముద్రంలో కదులుతున్న వీడియో చూశారా, నవంబర్ 25న తీరం దాటే అవకాశం, తమిళనాడు, ఏపీని వణికించనున్న అతి భారీ వర్షాలు

కామ్ ఈ నివార్ తుఫాను కదులుతున్న వీడియోని అందించింది.లైవ్ ట్రాకర్ (Cyclone Nivar Live Tracker Map on Windy) ద్వారా ఈ తుఫాను కదలికలను తెలుసుకోవచ్చు.

Arabian Sea to see 5th cyclone Pawan, this year veers away from India (photo-PTI)

Amaravati, November 24: మరో తుఫాను ముంచుకొస్తోంది. నివార్‌‌గా (cyclone Nivar) పిలుస్తున్న ఈ తుఫానుతో తమిళనాడుకు, ఏపీకి పెను ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశల్లో ప్రయాణించి మంగళవారం ఉదయం 5.30కు తుఫానుగా మారింది.

పుదుచ్చేరికి తూర్పు, ఆగ్నేయ దిశగా 410 కి.మీ.లు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 450 కి.మీ.ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విండ్. కామ్ ఈ నివార్ తుఫాను కదులుతున్న వీడియోని అందించింది.లైవ్ ట్రాకర్ (Cyclone Nivar Live Tracker Map on Windy) ద్వారా ఈ తుఫాను కదలికలను తెలుసుకోవచ్చు.

వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడులోని కరైకల్-మామల్లాపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో బుధవారం సాయంత్రం తీవ్ర తుఫానుగా మారి తీరాన్ని దాటనుందని సమాచారం. తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 కి.మీ.ల నుంచి గరిష్టంగా 120 కి.మీ.ల వేగంతో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నివార్’ సైక్లోన్‌తో ప్రభుత్వం అప్రమత్తమైంది.తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచనుండటంతో... మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తుపాన్ ప్రభావిత ప్రాంతాల అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. వ్యవసాయ, వైద్య, రెవెన్యూ శాఖలను అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది.

ఈ నెల 25న తీరాన్ని దాటనున్న నివార్, ఏపీకి పెను ముప్పు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలు అలర్ట్

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాను నవంబర్ 25 మధ్యాహ్నం కరైకల్ మరియు మహాబలిపురం వద్ద తీరంను తాకుతుందని తెలిపింది. ఆ సమయంలో తమిళనాడు తీరంలో కొండచరియలు విరిగిపడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా 29-30 ° C పరిధిలో ఉన్నాయి.

నివార్ ప్రస్తుతం బెంగాల్ బేలోని పుదుచ్చేరికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నవంబర్ 23 సాయంత్రం నాటికి తీవ్ర మాంద్యం.. నవంబర్ 24 ఉదయం తుఫానుగా తీవ్రమవుతుంది. ల్యాండ్‌ఫాల్ సమయంలో గాలి వేగం గంటకు 100-110 కిలోమీటర్ల పరిధిలో ఉండే అవకాశం ఉందని తేలిపింది. గంటకు 120 కి.మీ వరకు తుఫాను తీవ్రమైన తుఫానుగా మారుతుందని వెల్లడించింది.

సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర తీరం అధికంగా ఉన్న జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని వాతావరణ శాఖ తెలిపింది. రైతాంగం వ్యవసాయ పనుల యందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.