Gold Rates Increased: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంతో బంగారం ధరలకు రెక్కలు.. 24 గంటల వ్యవధిలోనే భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,200

ఆరు నెలల కనిష్ఠ స్థాయికి మొన్నటివరకూ పడిపోయిన పసిడి ధర కేవలం 24 గంటల వ్యవధిలోనే ఊహించనంతగా పెరిగింది.

Gold | Representational Image | (Photo Credits: IANS)

Hyderabad, Oct 10: బంగారం ధరలకు (Gold Price) మళ్లీ రెక్కలొచ్చాయి. ఆరు నెలల కనిష్ఠ స్థాయికి మొన్నటివరకూ పడిపోయిన పసిడి ధర కేవలం 24 గంటల వ్యవధిలోనే ఊహించనంతగా పెరిగింది. ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య కొనసాగుతున్న యుద్ధమే దీనికి కారణం. నిన్న ప్రారంభ ట్రేడింగ్ (Trading) లోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 440 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. నిన్నటి మార్కెట్ (Market) తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర మరో రూ. 220 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,200గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,350 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధరలకు కూడా పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 72,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర రూ. 500 పెరిగింది.

Murder Caught on Camera in Gwalior: గ్వాలియర్ లో దారుణం.. సర్పంచ్ ను కాల్చి చంపిన దుండగులు.. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వైరల్

ఇతర నగరాల్లో బంగారం ధరలు:

TSRTC Special Buses for Dasara: బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ శుభవార్త.. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులు.. అదనపు చార్జీలు లేకుండానే..