Hyderabad, Oct 10: బతుకమ్మ (Bathukamma), దసరా (Dasara) పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. ఈ నెల 13 నుంచి 24 వరకు 5,265 ప్రత్యేక బస్సులను (Special Buses) ఏర్పాటు చేసిన సంస్థ.. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. గత దసరా కన్నా ఈసారి వెయ్యి బస్సులను అదనంగా తిప్పుతున్నట్టు తెలిపారు. ఈసారి ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయట్లేదని సజ్జనార్ స్పష్టంచేశారు.
TSRTC to run 5,265 special buses for Bathukamma, Dasara from October 13-24@TSRTCHQ @tsrtcmdoffice #Telangana #Dasara https://t.co/XcsaCqYetK
— NewsTAP (@newstapTweets) October 9, 2023
కాల్ సెంటర్ నంబర్లు ఇవే
బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను సంస్థ అధికారిక వెబ్‌సైట్ tsrtconline.inలో చేసుకోవాలని సజ్జనార్ కోరారు. పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.