ప్రకృతి ఆరాధన, స్త్రీ శక్తి  స్వాభిమానత, పర్యావరణ సమతుల్యత, నీటి వనరుల సరయిన వినియోగం, జీవ వైవిధ్యం యొక్క ఆవశ్యకత, తరతరాల మధ్య భాషా , కళా , సాంసృతిక, సాహిత్య, సంప్రదాయ అనుసంధాన కర్త మన తెలుగు పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంప్రదాయాల సౌందర్యాన్ని ప్రతిబింబించే ఈ పూల పండుగ మన ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. కోటి రత్నాల మన తెలంగాణా లో మొదటి రత్నం మన బతుకమ్మ. ప్రకృతిని పార్వతిగా, పూలనే గౌరమ్మగా ఆరాధించే బతుకమ్మ పండుగ సందర్బంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా..అయితే ఇక్కడ ఉన్న ఫోటో గ్రీటింగ్స్ షేర్ చేసి తెలియజేయండి..

ఆడపడుచులు అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.

తెలుగు రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి నిలువుటద్దం, తెలంగాణ ఆడపడుచుల పూల పండుగ, ప్రకృతిని ఆరాధిస్తూ... పూలను పూజిస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ.

బతుకమ్మ .. వేడుక కాదు .. వేల కోట్ల మంది ఆడబిడ్డల జీవన బంధం .. బతుకు విధానం ..  బతుకమ్మ శుభాకాంక్షలు ..

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ… తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.

పూలకే పూజ చేసే పండుగ బతుకమ్మ. దేవుళ్లును పూజించాలంటే పూలతో పూజ చేస్తాం, కానీ పూలకే పూజ చేసే పండుగ బతుకమ్మ.