Edible Oil Prices Comedown: సామాన్యులకు ఊరట.. తగ్గనున్న వంటనూనెల ధరలు.. రిఫైన్డ్ నూనెలపై దిగుమతి సుంకం 17.5 నుంచి 12.5 శాతానికి తగ్గించిన కేంద్రం .. అమల్లోకి వచ్చిన కొత్త రేట్లు
కేంద్ర ప్రభుత్వం తాజాగా శుద్ధి చేసిన (రిఫైన్డ్) వంట నూనెలపై(సోయాబీన్, సన్‌ఫ్లవర్) దిగుమతి సుంకాన్ని తగ్గించింది.
Newdelhi, June 16: పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel), గ్యాస్ (Gas), నిత్యావసరాల ధరాభారంతో అల్లాడుతున్న సామాన్యులకు గుడ్ న్యూస్ (Goodnews)! దేశంలో వంటనూనెల ధరలు (Edible Oil Prices) మరింతగా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా శుద్ధి చేసిన (రిఫైన్డ్) (Refined) వంట నూనెలపై(సోయాబీన్, సన్‌ఫ్లవర్) దిగుమతి సుంకాన్ని తగ్గించింది. గతంలో 17.5 శాతంగా ఉన్న సుంకం ప్రస్తుతం 12.5 శాతానికి చేరుకుంది. నిన్నటి నుంచే ఈ తగ్గింపు అమ్మల్లోకి వచ్చింది. సాధారణంగా మన దేశం ముడి సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం రిఫైన్డ్ ఆయిల్స్ పైనా సుంకాన్ని తగ్గించింది. అయితే, తాజా నిర్ణయంతో దిగుమతులపై దీర్ఘకాలిక ప్రభావం ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
పండుగల సీజన్ భయం
త్వరలో పండుగల సీజన్ మొదలవుతుండటం.. ప్రస్తుతం శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ రూ. 140 వరకు ధర పలుకుతుండటం సామాన్యులను కలవరపెడుతున్నది. అయితే, వంటనూనెల ధరలు తగ్గుతాయని ఆర్థిక శాఖ పేర్కొనడం సామాన్యులకు ఊరట కలిగిస్తోంది.