Heavy Rains in Telangana: తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. రేపటి నుంచి అతి భారీ వర్షాలు.. వచ్చే రెండుమూడు రోజులూ ఇంతే.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపటి నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Hyderabad, July 18: తెలంగాణకు (Telangana) వాతావరణశాఖ కీలక సూచన చేసింది. రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపటి నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ అలెర్ట్ (Orange Alert) జారీ చేసింది. పౌరులెవరూ అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించింది. నాలాలు, గోతులు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
భారీ వర్షాలకు కారణమిదే
బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంపై రేపటిలోగా గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, దక్షిణ ప్రాంతంపై 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు మరో ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, ఫలితంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.