IPL Auction 2025 Live

Rains in Telangana: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Rains (Credits: Pixabay)

Hyderabad, July 9: రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలో (Telangana) భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడటం ద్వారా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూలై 13 నుంచి హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. నేటి నుంచి శుక్రవారం వరకు నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, రామగుండం, ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు 13 జిల్లాలకు ఎల్లో అలెర్ట్  జారీ చేసింది.

భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి, అమరులైన నలుగురు జవాన్లు, ఆరుగురికి తీవ్ర గాయాలు

నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి

మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఆర్మీ వాహనాలే లక్ష్యంగా కాల్పులు, సమర్ధవంతంగా తిప్పికొట్టిన భారత బలగాలు