Rain Alert for Telugu States: మరో హెచ్చరిక, తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు, వాయుగుండంగా మారనున్న అల్పపీడనం, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains thundershowers)ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

cyclonic storm to hit Telugu States with heavy rains (Photo Credits: PTI)

Hyderabad, Oct 18: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ (Rain Alert for Telugu States) చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం (Heavy Rains thundershowers)ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

ఇక దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదేవిధంగా దక్షిణ కోస్తాకు దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకూ అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మరోవైపు మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది బలపడి తదుపరి 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో ఈ నెల 19, 20, 21 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాలతో రూ.4,450 కోట్ల మేర నష్టం, వెంటనే ఆదుకోవాలని హోం మంత్రి అమిత్ షాకు ఏపీ సీఎం లేఖ, తక్షణమే ముందస్తుగా రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని వైయస్ జగన్ వినతి

అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. ఈ కారణంగా ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ కోస్తా, యానాం పరిసర ప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

మళ్లీ విరుచుకుపడిన వానదేవుడు, జల రక్కసితో వణికిన హైదరాబాద్‌, వాయుగుండంగా మారిన అల్పపీడనం, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాతబస్తీలో పర్యటించారు. వదలల్లో చిక్కుకున్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పాతబస్తీలో స్థానిక పోలీసులను అలెర్ట్ చేశామని, వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ఫలక్‌నుమా బ్రిడ్జిపై ఆరడుగుల గొయ్యి పడింది, ట్రాఫిక్ డైవర్ట్ చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ సహకారంతో వరద బాధితులను రెస్క్యూ చేస్తున్నామన్నారు.

ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి రావొద్దని అంజనీకుమార్ హెచ్చరించారు. పాతబస్తీ, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో వరద నీరు చేరిందని, హైదరాబాద్‌లో కేవలం సౌత్ జోన్, ఈస్ట్ జోన్ మినహా అన్ని ప్రాంతాల్లో యథావిధిగా వాహన రాకపోకలుంటాయని ప్రకటించారు. వరద ప్రాంతాల్లోనే ట్రాఫిక్‌ను డైవర్షన్ చేశామని అంజనీకుమార్ తెలిపారు.