Hyderabad, Oct 18: వానదేవుడు మరోసారి భాగ్యనగరంపై పంజా విసిరాడు. గత వారం రోజుల నుంచి నీడలా (#HyderabadFloods) వెంటాడుతున్నాడు. వందేళ్లలో ఎన్నడూ చూడని వర్షం నాలుగైదు రోజుల కిందట మహానగరాన్ని నిండా ముంచగా... శనివారం మళ్లీ సీన్ రిపీటైంది. ఉరుములు, మెరుపులతో కూడిన క్యుములోనిం బస్ మేఘాల తీవ్రతతో శనివారం రాత్రి హైదరాబాద్ మళ్లీ (Hyderabad Faces Waterlogging in Several Areas) వణికిపోయింది.మరో పిడుగు పడినట్లుగా తూర్పు మధ్య అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం (Low pressure) శనివారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ (Department of Meteorology) వెల్లడించింది. సౌరాష్ట్రకు దక్షిణ దిశగా, ముంబై నగరానికి పశ్చిమ వాయవ్య దిశగా ఈ వాయుగుండం కేంద్రీకృతమైనట్లు తెలిపింది.
దీని ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వివరించింది. ఈ వాయుగుండం ప్రభావం రానున్న 48గంటల పాటు కొనసాగి క్రమంగా బలహీనపడే అవకాశముందని పేర్కొంది. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈనెల 19న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఇది తదుపరి 24 గంటల్లో బలపడనుందని హెచ్చరించింది.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి (DGP Mahender Reddy) పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ చేపడుతున్న సహాయక చర్యలపై ఆయన అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో శనివారం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ (Meteorological Department of India) హెచ్చరించిన నేపథ్యంలో పోలీసు సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు, ముందస్తు వ్యూహాలు సిద్ధం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పలు ప్రాంతాల్లో వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నదులు, చెరువులు, రిజర్వాయర్లు తదితర జలవనరుల వద్ద అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
#HyderabadFloods:
Telangana: Heavy rainfall triggers water logging in parts of Hyderabad. pic.twitter.com/fwvQDAnawU
— ANI (@ANI) October 17, 2020
#WATCH || @Director_EVDM DRF teams undertake rescue operations in Old City area of #Hyderabad. Many colonies are inundated with water up to waist level. @metcentrehyd forecasts more rains today @timesofindia @TOICitiesNews @TOITelangana#HyderabadFloods #HyderabadRains pic.twitter.com/Aqw8Thp8kM
— TOI Hyderabad (@TOIHyderabad) October 18, 2020
భారీ వర్షాల నేపథ్యంలో రూ.2800 విలువైన సీఎం రిలీఫ్ కిట్లను వరద బాధితులకు నేరుగా అందజేయాలని జీహెచ్ ఎంసీ అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఆదేశించారు.
మంగళ, బుధ వారాల్లో కురిసిన రికార్డు వర్షం తాలూకు వరదతో కాలనీలు ఇంకా తేరుకోకముందే శనివారం అదే ప్రాంతాలను హడలెత్తించింది. శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి హయత్‌నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, మీర్‌పేట, పోచారం, ఘట్కేసర్‌లలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్ – విజయవాడ ప్రధాన రహ దారితో పాటు నగరంలోని రహదారులు పూర్తిగా జలమయమై ఈ రెండు రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
#HyderabadRains
Moosaram bagh again flooded#HyderabadFloods #HyderabadRains pic.twitter.com/bkoTmoMb1F
— Salam Hyderabad (@HyderabadSalam) October 18, 2020
#Dilushuknagar Main Road choose alternate Routes#HyderabadRains #HyderabadFloods #Hyderabadrain #Telangana pic.twitter.com/w9ZdLhGG7b
— Political Vault (@PoliticalVault) October 18, 2020
పాతబస్తీలోని ఛత్రినాకలో వరదనీటిలో పలు వాహనాలు మళ్లీ కొట్టుకుపోయాయి. ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పైభాగంలో భారీ గొయ్యి పడటంతో బ్రిడ్జిని మొత్తం మూసేశారు. పాతబస్తీ బాబానగర్ పరిధిలోని గుర్రం చెరువు గండి మరింత పెద్దది కావటంతో వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే ఉప్పల్, ఎల్బీ నగర్, అంబర్‌పేట ప్రాంతాల్లో నాలుగు రోజులుగా వరదనీటిలోనే మునిగిన కాలనీల్లో శనివారం నాటి వర్షం పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చింది.
నాగోలు బండ్లగూడ, సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్‌లో ఇటీవల మునిగి ఈ రోజే కాస్త ఉపశమనం పొందిన కాలనీలు, ఇళ్లలోకి శనివారం రాత్రి మళ్లీ వరద నీరు వచ్చి చేరింది. బీఎన్‌రెడ్డి డివిజన్ కప్రాయి చెరువు పరిసరా ల్లోని హరిహరపురంకాలనీ, గాంధీనగర్‌కాలనీ సహా మీర్‌పేటలోని మంత్రాల చెరువు కింద ఉన్న మిథు లానగర్, సాయినగర్ కాలనీలతో పాటు హయత్ నగర్ డివిజన్ పరిధిలోని బంజారాకాలనీ, వనస్థ లిపురం కాలనీ పరిధిలోని మల్లికార్జున కాలనీలు గత నాలుగు రోజుల నుంచి నీటిలోనే ఉండిపో యాయి. నాగోలు బండ్లగూడ పరిధిలోని సాయినగర్, ఆదర్శనగర్, ఎల్బీనగర్ పరిధిలోని హరిహరపురం, మిథులానగర్, మల్లికార్జుననగర్, బంజారాకాలనీ, రెడ్డికాలనీ, బైరామల్‌గూడ, హబ్సి గూడ రవీంద్రనగర్, లక్ష్మీనగర్, సాయిచిత్రనగర్, మధురానగర్‌లో వరద నీరు మరో అడుగు మీదకు చేరింది.
బండ్లగూడ చెరువుకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో చెరువు కింది భాగంలో ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. నాలుగు రోజులుగా వరదలో చిక్కుకున్న కాలనీలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఆయా కాలనీల్లో అంధకారం నెలకొంది. కాగా మలక్‌పేట పోచమ్మ దేవాలయ సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ముట్టుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాములు(40) అక్కడికక్కడే మరణించాడు.
ఘట్కేసర్, ఫిర్జాదిగూడ, ఉప్పల్ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ఉప్పల్ నుంచి చిలుకానగర్ వైపు వెళ్లే రోడ్డులో కావేరీనగర్, న్యూభరత్‌నగర్, శ్రీనగర్ కాలనీ, తదితర ప్రాంతాల్లో వరదతో పాటు ఇళ్లల్లోకి చేరిన బురదతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలను ఈ వర్షం మరింత ఆందోళనకు గురిచేసింది. మంగళవారం 33 సెంటీమీటర్ల ఆల్‌టైం రికార్డ్ వర్షపాతం కురిసిన పోచారం, ఘట్కేసర్‌లలోనూ శనివారం మరోసారి కుండపోత స్థానికులను భయకంపితులను చేసింది.
హైదరాబాద్ –విజయవాడ రహదారిపై చైతన్యపురి, చింతలకుంట, అబ్దుల్లాపూర్‌మెట్ ఇనాంగూడ వద్ద భారీగా వరద నీరు చేరటంతో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపేశారు. వరంగల్ – హైదరాబాద్ రూట్‌లో నారపల్లి – జోడిమెట్ల, ఉప్పల్ చెరువు వద్ద వరద నీరు చేరటంతో వాహనాలను అనుమతించలేదు.
ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వస్తుండటంతో శనివారం రాత్రి 9 – 10 గంటల మధ్యలో మూడు గేట్లు ఎత్తి వేశారు. ప్రస్తుతం నాలుగు గేట్ల ద్వారా నాలుగు అడుగుల వరద నీరు దిగువ ప్రాంతానికి వెళుతోంది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.
నిన్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, కర్మాన్‌ఘాట్, మీర్‌పేట, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. పాతబస్తీలో మరోసారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో ప్రజలు భయంతో ఇళ్లకు పరుగులు తీశారు. ఈ రాత్రి ఎలా గడుస్తుందోనని ముంపు ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.