IMD Weather Forecast: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, వచ్చే 5 రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో, ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Rains

కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. దీంతో, ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కరిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అతి భారీ వర్షం

ఇక తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలను ఆనుకుని బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం కొనసాగుతుండగా, అదే ప్రాంతంలో ఈ నెల 24న మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవన ద్రోణి కూడా స్థిరంగా కొనసాగుతుండడంతో, విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

గోదావరి నది వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, భద్రాచలం వద్ద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

తెలంగాణలో నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో కోస్తా రాయలసీమల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది, వచ్చే రెండు మూడు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

శనివారం వరకు స్కూళ్లకు సెలవులు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం, ఐటీ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు

ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అత్యవసరమైతేనే బయటకు ప్రజలు బయటకు రావాలని ప్రభుత్వం మెచ్చరిస్తోంది. హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్ పోటెత్తుతోంది. తూము ద్వారా అధిక మొత్తంలో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటికీ సెలవు ప్రకటించింది. ప్రైవేటు కార్యాలయాలూ సెలవులు ప్రకటించేలా కార్మిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మరో నాలుగైదు రోజులు కుండపోత తప్పదని వాతావరణ శాఖ పేర్కొంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif