Rains in Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ ప్రకటన
ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది.
Hyderabad, Sep 30: తెలంగాణలో (Telangana) నేడు, రేపు వర్షాలు (Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో (Bay of Bengal) అల్పపీడనం, దానికి అనుబంధంగా అవర్తనం కూడా ఏర్పడినట్టు వెల్లడించింది. ఫలితంగా, శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసాయి.
ఎక్కడ ఎంత వర్షం పడిందంటే?
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో శుక్రవారం అత్యధికంగా 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 8.2 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 8, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 7.4, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 6.7, కరీంనగర్ జిల్లా గంగాధరలో 6.4, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరవ్యాప్తంగా, పరిసర జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడ్డాయి.