IRCTC-iPay: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, బుకింగ్ టికెట్ రద్దయిన వెంటనే రీఫండ్, యూజర్ ఇంటర్ ఫేస్ అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్​సీటీసీ, IRCTC-ipay ద్వారా టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి

ఐఆర్​సీటీసీ తన వెబ్ సైట్, యాప్ IRCTC iPayలో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.

RailTel to continue free WiFi service at railway stations after Google will stop Project Station(Photo-ANI)

రైల్వే ప్రయాణికులకు ఐఆర్​సీటీసీ శుభవార్తను అందించింది. ఐఆర్​సీటీసీ తన వెబ్ సైట్, యాప్ IRCTC iPayలో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక, Livehindustan ప్రకారం, ఐఆర్​సీటీసీ చెల్లింపు గేట్ వే ఐఆర్​సీటీసీ-ఐపే ద్వారా టిక్కెట్లు బుక్ చేసే ప్రయాణీకులు రద్దు చేసిన వెంటనే రీఫండ్ (refund immediately) పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా ఐఆర్​సీటీసీ-ఐపేను 2019లో ప్రారంభించింది. దీనికి సంబంధించి ఐఆర్​సీటీసీ తన వెబ్ సైట్ ను కూడా అప్ గ్రేడ్ చేసిందని తెలిపింది

పెరుగుతున్న రైల్వే ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, ఐఆర్​సీటీసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసిందని, దీని వల్ల టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుందని ఐఆర్​సీటీసీ అధికార ప్రతినిధి తెలిపినట్లు ఆ కథనంలో తెలిపింది.

రైల్వే తీపి కబురు, ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటన, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే పరిధిలో 24 రైళ్లకు గ్రీన్ సిగ్నల్, రైళ్లు నడిచే సమయంతో పాటు చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవు, రైళ్ల పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకోండి

ఈ కొత్త ఏర్పాట్ల వల్ల ప్రయాణీకులు తత్కాల్, సాధారణ టిక్కెట్లను సులభంగా బుక్ చేయడమే కాకుండా రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేటట్లు వెబ్ సైట్, పోర్టల్ ఆధునీకరణ చేసినట్లు తెలిపారు.

IRCTC-ipay ద్వారా మీరు టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ ఉంది:

> ముందుగా IRCTC వెబ్‌సైట్‌ను తెరవండి (www.irctc.co.in)

> ఆ తర్వాత ప్రయాణానికి సంబంధించిన అన్ని వివరాలను పూరించండి

> మీరు వెళ్లాలనుకున్న రైలును ఎంచుకోండి

> మీ ఆధారాలను ఉపయోగించి వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి.

> ప్రయాణీకుల వివరాలను అందులో నమోదు చేయండి

> చెల్లింపు మోడ్‌ను ఎంచుకోండి. ఇక్కడ ప్రయాణీకులు ఐఆర్‌సిటిసి ఐపే ఎంపికను ఎంచుకోవాలి

> పే అండ్ బుక్ పై క్లిక్ చేయండి.

> క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / ప్రీపెయిడ్ కార్డ్ / యుపిఐ వివరాలను నమోదు చేయండి

> చెల్లింపు తరువాత, టికెట్ వెంటనే బుక్ చేయబడుతుంది మరియు నిర్ధారణ SMS మరియు ఇమెయిల్ ద్వారా పంపబడుతుంది.