Monsoon in Telangana: తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. వచ్చే నెల 5 - 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం.. వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి
జూన్ 5 - 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది.
Hyderabad, May 21: తెలంగాణ (Telangana) రైతన్నలకు (Farmers) శుభవార్త. జూన్ 5 - 11 మధ్యలో రాష్ట్రంలోకి రుతుపవనాలు (Monsoon) ప్రవేశించనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రకటించింది. తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి అయిదారు రోజుల సమయం పడుతుంది. ఈసారి నైరుతి గమనం సానుకూలంగానే ఉండబోతోందని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది కేరళను జూన్ 11న తాకిన రుతుపవనాలు తెలంగాణలో 20నాటికి విస్తరించిన విషయం తెలిసిందే.
కారణం ఇదే?
ఈసారి నైరుతి గమనం సానుకూలంగా ఉండటానికి కారణం.. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండటమేనని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.