Telangana Cabinet Meeting (Photo-TSCMO)

Hyd, May 20: ఎన్నికల కమిషన్‌(ఈసీ) అనుమతితో సోమవారం(20)సచివాలయంలో సమావేశమైన తెలంగాణ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్‌ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగింది. రాష్ట్ర అవతరణ వేడుకలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.  చేప ప్రసాదం పంపిణీ తేదీలు ఇవిగో, జూన్‌ 8 ఉదయం 11 నుంచి జూన్‌ 9 ఉదయం 11 గంటల వరకు, నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో పంపిణీ

జూన్ 2న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. వచ్చే సీజన్‌ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్‌ ఇవ్వడంతో పాటు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్‌ నిర్ణయించింది.

అమ్మ ఆదర్శ కమిటీద్వారా ప్రభుత్వస్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించాం. కాళేశ్వడ్యామ్‌పై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. వర్షా కాలంలో గేట్లు తెరిచే ఉంచాలి. ఒక్క చుక్క నీరు కూడా నిల్వ ఉంచొద్దని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది’ అని మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సూచనలకనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. ‘‘మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే.. సరి అవుతుందన్న గ్యారెంటీ లేదని, నీరు నిల్వ చేసే పరిస్థితి కూడా లేదని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ చెప్పింది. అందుకే, తాత్కాలికంగా ఏమైనా ఏర్పాటు చేసైనా సరే రైతులకు నీరు ఇవ్వాలని భావిస్తున్నాం’’ అన్నారు.