New Low Pressure: మళ్లీ ఇంకో అల్పపీడనం, నెల్లూరుతో సహా రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు, ఈ నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ

ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది.

nivar cyclonic storm to hit Telugu States with heavy rains (Photo Credits: PTI)

Amaravati, Nov 24: నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు–శ్రీలంక తీరంలో బుధవారం అల్పపీడనం (New Low Pressure) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక–ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉంది.

ఈ అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.మరోవైపు నైరుతి బంగాళాఖాతం మధ్య ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం (New low pressure over Bay of Bengal in next 24 hours) దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉంది. అయితే ఇది తుఫానుగా మారే అవకాశం తక్కువని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) ఏరియా తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ ఎన్ పువియరాసన్ అన్నారు.

రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి, హెలికాప్టర్‌ సాయంతో ఆహార పంపిణీ చేపట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే

బంగాళాఖాతంలో(Bay of Bengal) అల్పపీడన పరిస్థితులు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 27 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అనంతపురం, కర్నూలు, విజయనగరం, ఉభయగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అల్పపీడన ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27వ తేదీ వైఎస్సార్‌ జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.రైతులు, సాధారణ పౌరులు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరారు. డిసెంబర్‌ 15వ తేదీ వరకు నైరుతి బంగాళాఖాతంలో వరుసగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలున్నట్లు తెలిపారు.

వరదలతో ఏపీ విలవిల, బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కంది పప్పు, లీటరు వంట నూనె, కేజీ ఉల్లి పాయలు, కేజీ బంగాళ దుంపలు ఉచితంగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

తమిళనాడులో రాజధాని చెన్నైలో రాబోయే 48 గంటల్లో, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, రాణిపేటలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. తమిళనాడులోని చెన్నై, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి, రామనాథపురం, డెల్టా జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. నవంబర్ 26, 27 తేదీల్లో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, తిరువణ్ణామలై, విల్లుపురం, వెల్లూరు, తిరుపత్తూరు, రామనాథపురం, పుదుకోట్టై, తిరునల్వేలి, తూత్తుకుడి, తమిళనాడులోని కన్యాకుమారి, డెల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కారైకల్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కన్యాకుమారి తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, తమిళనాడు తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రాగల 48 గంటలపాటు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 1 నుండి నవంబర్ 22 వరకు, తమిళనాడు సాధారణ వర్షపాతం 23 సెంటీమీటర్లకు వ్యతిరేకంగా 53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది 67 శాతం పెరిగింది. అదేవిధంగా, చెన్నైలో 92 సెంటీమీటర్ల వర్షపాతం 66 శాతం పెరిగింది, సాధారణ వర్షపాతం 55 సెం.మీ. ఇప్పటివరకు, మధురైలో మాత్రమే చాలా తక్కువ వర్షపాతం నమోదైంది, దాని సాధారణ వర్షపాతం 33 సెం.మీ.కు వ్యతిరేకంగా 31 సెం.మీ., అయితే ఆ జిల్లాలో రాబోయే 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని పువియరసన్ చెప్పారు.