Odisha Train Tragedy Update: ఒడిశా రైలు దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదిగో..
సర్వీసులను రద్దు చేయడంతో చెన్నై సహా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విజయవాడ రైల్వేస్టేషనులో శనివారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు.
Vijayawada, June 4: ఒడిశాలో (Odisha) మూడు రైళ్ల ఘోర ప్రమాదంతో (Train Accident) దక్షిణ, ఆగ్నేయ రైల్వేజోన్లలో 90 రైళ్లను రద్దు చేసి, 46 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సర్వీసులను రద్దు (Services Cancelled) చేయడంతో చెన్నై సహా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విజయవాడ రైల్వేస్టేషనులో శనివారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు. విశాఖ, సికింద్రాబాద్ మధ్యలో నడిచే ఒకటి రెండు రైళ్లు మాత్రమే ఉదయం నుంచి రాకపోకలు సాగించాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు వచ్చిన గోరఖ్‌పూర్ - కొచ్చువేలి (12511) రైలులో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. చెన్నై వెళ్లే రైలు కావడంతో ప్రయాణికులు బాత్‌రూమ్‌లు, తలుపుల వద్ద కూడా కూర్చున్నారు. కొందరు యువకులు కిటికీలను పట్టుకుని వేలాడుతూ ప్రమాదకరంగా వెళ్లారు.
రద్దయిన సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు..
హావ్‌డా - బెంగళూర్ (12863), హావ్‌డా - చెన్నై మెయిల్ (12839), చెన్నై - షాలిమర్ కోరమాండల్ (12842), బెంగళూరు - గువాహటి (12509), హావ్‌డా - సికింద్రాబాద్ (12703), హావ్‌డా - బెంగళూరు(12245), షాలిమర్ - హైదరాబాద్ (18045), హావ్‌డా - తిరుపతి (20889), బెంగళూరు - గువాహటి (12509), చెన్నై సెంట్రల్ - షాలిమర్ (12842), తిరుపతి - హావ్‌డా (20890), బెంగళూరు - కామాఖ్య (12551), బెంగళూరు - హావ్‌డా (12864), బెంగళూరు - బగల్‌పూర్ (12253), హైదరాబాద్ - షాలిమర్ (18046), సికింద్రాబాద్ - హావ్‌డా (12704), వల్లిపురం - పురులియా (22606), తిరువనంతపురం - షాలిమర్('22641).
మళ్లించిన సూపర్‌ఫాస్ట్ రైళ్లు...
చెన్నై - హావ్‌డా (12840), వాస్కోడగామా - హావ్‌డా (18048), సికింద్రాబాద్ - షాలిమర్ (22850), బెంగళూర్ - గువాహటి (12509), తాంబరమ్ - న్యూ తిన్‌సుకియా (15929), సంతరాగాఛీ - చెన్నై (22807), దిగ - విశాఖపట్నం (22873), హావ్‌డా - మైసూర్ ఎక్స్‌ప్రెస్ (22817), సంతరాగాఛీ - చెన్నై (22807), చెన్నై సెంట్రల్ - హావ్‌డా (22187), చెన్నై సెంట్రల్ - వాస్కోడగామా (12840), వాస్కోడగామా - హావ్‌డా (18048), సికింద్రాబాద్ - షాలిమర్ (22850), బెంగళూరు - గువాహటి (12509), తాంబరం - న్యూ తిన్‌సుకియా (15929), సెలిచర్ - త్రివేండ్రం (12508), న్యూజలాయ్‌గురి - చెన్నై (22612), దిల్‌బర్గ్ - సికింద్రాబాద్(7047).