Fuel Price Hike: మళ్లీ పెట్రో బాదుడు బాదుడు మొదలైంది, దేశంలో 18 రోజుల తర్వాత పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు, దేశ రాజధానిలో పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు పెంపు

18 రోజుల పాటు పెరగని ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు (Petrol and Diesel Prices in India on May 4, 2021) ప్రకటన వెలువడింది.

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre (Photo-Getty)

New Delhi, May 4: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను (Fuel Price Hike) పెంచేశాయి. 18 రోజుల పాటు పెరగని ధరలు మంగళవారం ఒక్కసారిగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 16 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు (Petrol and Diesel Prices in India on May 4, 2021) ప్రకటన వెలువడింది.

దీంతో పెట్రోలు ధర రూ. 90.56కు, డీజిల్ ధర రూ.80.73కు పెరిగింది. గడచిన రెండు నెలల వ్యవధిలో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే పెట్రోలు ధరల సవరణ జరిగింది. అది కూడా ధరల తగ్గింపు మాత్రమే కనిపించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియగానే ధరలు పెరగడం గమనార్హం.

తాజాగా పెంచిన రేట్ల ప్రకారం పెట్రోలు ధర ఢిల్లీలో 90.55 ఉండగా, డీజిల్ ధర 80. 91గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర ఢిల్లీలో 96.95 ఉండగా, డీజిల్ ధర 87. 98గా ఉంది. అదేవిధంగా చెన్నైలో పెట్రోలు ధర ఢిల్లీలో 92.55 ఉండగా, డీజిల్ ధర 85.90గా ఉంది. ఇక కలకత్తాలో పెట్రోలు ధర ఢిల్లీలో 90.76 ఉండగా, డీజిల్ ధర 83. 78గా ఉంది.

కరోనా వస్తే సీటీ స్కాన్‌ అవసరం లేదు, దాని ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశం, ఒక్క సీటీ స్కాన్‌ 300-400 ఎక్స్‌రేలతో సమానం, సీటీ స్కాన్‌కు సంబంధించి కీలక సూచనలు చేసిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

కాగా, గత సంవత్సరంలో పెట్రోలు ధర సగటున రూ. 21.58, డీజిల్ ధర రూ. 19.18 పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిన కారణంగానే ధరలను పెంచలేదని, మొత్తం మీద 7 శాతం వరకూ డిమాండ్ తగ్గిందని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయని, ఆ కారణంగానే ఇండియాలోనూ ధరలను సవరించాల్సి వచ్చిందని స్పష్టం చేశాయి.

27 ఏళ్ల వివాహ బంధానికి సెలవు ప్రకటించిన బిల్​గేట్స్, భార్య మిలిందా గేట్స్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడి, బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపిన దంపతులు

ఇండియాలో పన్నులు లేకుంటే, పెట్రోలు ధర లీటరుకు రూ. 33 మించదు. ఉదాహరణకు ఢిల్లీనే చూసుకుంటే, అక్కడ లీటరు పెట్రోలు ధర రూ. 32.98 కాగా, రాష్ట్ర ప్రభుత్వ సేల్స్ ట్యాక్స్, వ్యాట్ కలిపి రూ. 19.55 కాగా, సెంట్రల్ ఎక్సైజ్ సుంకం రూ. 31.83, వ్యాట్ రూ. 10.99 ఉంది. దీనికి డీలర్ కమిషన్ అదనం. పన్నుల భారాన్ని తగ్గిస్తే, పెట్రోలు ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నా, ఆయిల్ రంగాన్ని తమకున్న ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయనడంలో సందేహం లేదు.