Bill Gates Divorce: 27 ఏళ్ల వివాహ బంధానికి సెలవు ప్రకటించిన బిల్​గేట్స్, భార్య మిలిందా గేట్స్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడి, బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపిన దంపతులు
Bill Gates and Melinda Gates (Photo Credits: Facebook)

Washington, May 4: ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్(65), ఆయన సతీమణి మిలిందా గేట్స్(56) సంచలన ప్రకటన చేశారు. తమ 27 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి (Bill and Melinda Gates Announce To End Marriage After 27 Years) పలకాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భార్య మిలిందా ( Melinda Gates) నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్‌ ద్వారా బిల్​గేట్స్ ప్రకటించారు.

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడిగానే కాకుండా.. బిల్‌మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ (Bill & Melinda Gates Foundation) ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన దంపతులిద్దరూ (Bill and Melinda Gates) విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గత 27 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు పొందిన ఈ జంట.. ఇకపై దంపతులుగా కలిసి ఉండలేమని భావిస్తున్నట్లు తెలిపారు. జీవితంలో ఇక భార్యాభర్తలుగా కలిసి ఉండలేమని ఇరువురు సంయుక్త ప్రకటన చేశారు. అయితే, తమ బిల్‌-మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా స్వచ్ఛంద కార్యక్రమాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ట్విటర్ వేదికగా సోమవారం ఈ విషయాన్ని బిల్‌గేట్స్ దంపతులు వెల్లడించారు.

Here's the tweet by Bill Gates: 

Here's the tweet by Melinda French Gates:

‘ఎన్నో సమాలోచనల అనంతరం మా వివాహ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చాం. గత 27 ఏళ్లలో మేం ముగ్గురు అత్యద్భుతమైన పిల్లలను తీర్చిదిద్దాం. దాంతో పాటు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశాం. ఈ మిషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది.

బిల్‌గేట్స్ నా క్లాస్‌మేట్ అన్నందుకు నా పిల్లలు నన్ను లూజర్ అంటున్నారు, అందుకే ఆయనంటే నాకు పగ అంటున్న ఆనంద్ మహీంద్రా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇద్దరి క్లాస్ మేట్స్ ఫన్నీ కథ

కానీ, జీవితంలోని తర్వాతి దశల్లో దంపతులుగా ఇక కొనసాగలేమని భావించాం. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’ అని బిల్‌గేట్స్‌, మిలిందా ట్విట్టర్‌ ద్వారా సంయుక్త ప్రకటనలో ప్రకటించారు.

కరోనాకు 2021లో అంతం తప్పదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిలియనీర్‌ బిల్‌ గేట్స్‌, ధనిక దేశాల్లో 2021 మే నాటికి..మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి కనుమరుగవుతుందని వెల్లడి

మైక్రోసాఫ్ట్‌ను స్థాపించి బిల్‌గేట్స్‌ సీఈవోగా ఉన్న సమయంలో 1987లో మెలిందా ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేరారు. ఇద్దరూ తొలిసారిగా న్యూయర్క్‌ నగరంలో జరిగిన విందు కార్యక్రమంలో కలుసుకోగా.. ఆ తర్వాత 1 జనవరి, 1994లో హవాయిలో వీరిద్దరి పెళ్లి జరిగింది. బిల్‌, మెలిందా దంపతులకు జెన్నిఫర్ కాథరిన్ గేట్స్, రోరిజాన్‌ గేట్స్‌, ఫోబ్ అడిలె గేట్స్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు.

బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4,600 కోట్లు, లిక్విడ్ ఇంజిన్‌తో నడిచే సూపర్ బోట్‌ను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ అధినేత, ఈ బోట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. గత ఫిబ్రవరి నాటికి ఆయన ఆస్తి 133 బిలియన్‌ డాలర్లు. మైక్రోసాఫ్ట్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నాక 2000 సంవత్సరంలో స్థాపించిన బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ను స్థాపించారు. ఇప్పటివరకూ 54.8 బిలియన్‌ డాలర్లను ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయగా.. ఇందులో 1,600 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.