Bill Gates Yacht: బిల్ గేట్స్ ముచ్చట ఖరీదు రూ.4,600 కోట్లు, లిక్విడ్ ఇంజిన్‌తో నడిచే సూపర్ బోట్‌ను కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్ అధినేత, ఈ బోట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి
Bill Gates buys Rs 4,600 crore hydrogen-powered superyacht (photo-IANS)

Washington, Febuary 10: డబ్బుంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యమవుతుంది. ఎంత డబ్బుంటే అంత విలాసవంతమైన జీవితం అనుభవించవచ్చన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు కార్పోరేట్ దిగ్గజాలకు కూడా అదే పనిచేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్టోరీలో బిల్ గేట్స్ ముచ్చట గురించి తెలుసుకోవచ్చు. బిట్ గేట్స్ ముచ్చట పడిన కొన్న వస్తువు ఖరీదు అక్షరాల రూ. 4600 కోట్లు. వార్తా కథనంలోకి వెళితే..

ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు అయిన మైక్రోసాఫ్ట్‌ (Microsoft) వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ (Bill Gates) ఓ అద్భుతమైన షిప్ ను కొనుగోలు చేశారు. దాని ఖరీదు రూ.4600 కోట్లు. అత్యంత విలాసవంతమైన ఈ యాట్‌ (విహార నౌక)ను(Bill Gates Yacht) బిల్‌గేట్స్‌ 2019లో కొన్నారు.

మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో (Monaco Yacht Show) ఈ అద్భుతమైన షిప్ నమూనాను చూసి ఆయన ఎంతో ముచ్చటపడిపోయారు. పైగా అది పర్యావరణ హితమైనదని తెలిసి వెంటనే కొనేశారు. దీనికి సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లించి పనులు ప్రారంభించాలని సూచించారు. దీనిపైరు ఆక్వా (AQUA) అని తెలుస్తోంది.

టామ్ అండ్ జెర్రీకి 80 ఏళ్లు, నవ్వులు పూయిస్తున్న ఫస్ట్ వీడియో క్లిప్

ఆక్వా నౌక విశేషాలు:

ఆక్వా నౌక 370 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో నాలుగు గెస్ట్‌ రూమ్‌లు, రెండు వీఐపీ గదులు, యజమాని రూమ్‌ ఉంటుంది. ఇందులో 5 డెక్‌లు ఉంటాయి. 14 మంది అతిథులు, 31 మంది సిబ్బంది ఈ బోట్‌లో వెళ్లవచ్చు. అలాగే ఒక జిమ్‌, యోగా స్టూడియో, బ్యూటీ రూం, మసాజ్‌ పార్లర్‌, స్విమ్మింగ్‌ పూల్‌ తదితర సదుపాయాలు ఈ బోట్‌లో ఉన్నాయి.

ఈ పడవ లిక్విడ్‌ హైడ్రోజన్‌తో నడుస్తుంది. అంటే కేవలం నీటిని మాత్రమే ఇది వ్యర్థంగా బయటకు వదులుతుంది. లిక్విడ్‌ హైడ్రోజన్‌తో నడిచే ప్రపంచంలోని ఏకైక బోటు (Hydrogen-Powered Superyacht) కూడా ఇదే కావడం మరో విశేషం.

ఆధార్‌లో బంధుత్వాలు కనిపించవు, కేవలం కేరాఫ్ మాత్రమే ఉంటుంది

దీంట్లో ఒకసారి ద్రవ హైడ్రోజన్ ఇంధనాన్ని నింపితే 3750 మైళ్లు ప్రయాణిస్తుంది. మైనస్ 253 డిగ్రీల టెంపరేచర్​ వద్ద 28 టన్నుల రెండు వాక్యూమ్​ సీల్డ్​ ట్యాంకుల్లో హైడ్రోజన్​ ఇంధనాన్ని నింపుతారు. ఒక్కసారి రెండు ట్యాంకులు ఫుల్​ చేస్తే ఏకంగా 6,035 కిలోమీటర్లు వెళుతుంది.నౌక వేగం గంటకు 17 నాటికల్‌ మైళ్లు ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ నౌక ప్రయాణించినప్పుడు కర్బన ఉద్గారాలూ వెలువడవు. నీళ్లు బయటకు వస్తాయంతే. దీంతో సముద్ర జలాలకు ఎటువంటి హానీ జరుగదు.

2020 మార్చి 30 లోపు ఆధార్ పాన్ లింక్ చేయాల్సిందే 

ఎంతో విలాసవంతంగా, ఆధునిక టెక్నాలజీ సాయంతో నడిచే ఈ నౌకలో (Bill gates superyacht) బయటకు వెళ్లి విహారం చేయడానికి వీలుగా రెండు చిన్న బోట్లు కూడా ఉంటాయి. ఈ బోట్స్ ఒక్కోదాని పొడుగు 32 అడుగులు. కాగా ఇప్పటి వరకూ బిల్ గేట్స్‌కు సొంత విహార నౌక లేదు. ప్రస్తుతం ఈ నౌక తయారీ దశలో ఉంది. ఇది 2024 నాటికి బిల్‌గేట్స్‌ చేతికి రానుంది.

ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ లింక్ చేయడం ఎలా ?

ఇప్పటికే డీజిల్​ కాకుండా వేరే ఇంధనాలకు సంబంధించిన టెక్నాలజీలపై బిల్​గేట్స్​ పెట్టుబడులు పెడుతున్నారు. అందులో ఒకటి కాలిఫోర్నియాలో కడుతున్న హీలియోజెన్​ ప్రాజెక్ట్​. హైడ్రోజన్​ ఇంధనాన్ని పెట్రోల్, డీజిల్​ వంటి శిలాజ ఇంధనాలతో కాకుండా సోలార్​ పవర్​తో తయారు చేసే ప్రాజెక్ట్​ ఇది.