
New Delhi: ఆదాయపు పన్ను (Income Tax) చట్టం సెక్షన్ 138AA ప్రకారం జూలై 1, 2017 నాటికి పాన్ కార్డు కలిగిన ప్రతి వ్యక్తి తమ పాన్ కార్డు (Permanent Account Number)ను ఆధార్ కార్డు (Aadhaar Card) తో లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే పాన్- ఆధార్ లింక్ చేయలేదో సెప్టెంబర్ 30, 2019 వరకు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని డైడ్ లైన్ విధించింది. లేనిపక్షంలో పాన్ కార్డ్ ఉపయోగపడదు.
పాన్ కార్డ్ పనిచేయకపోతే ఐటీ సెక్షన్ 292B ప్రకారం రూ. 10,000 పెనాల్టీ పడటమే కాకుండా ఆదాయపు పన్ను ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఆధార్- పాన్ జతచేసేందుకు ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
1) ఐటీ వెబ్‌సైట్ లోకి లాగిన్ అయి, ఎడమ వైపు "Link Aadhar" అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. (https://www.incometaxindiaefiling.gov.in/home)
2) ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, మీ పేరు, పుట్టిన తేదీ ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేసి ఎంటర్ చేయాలి.
3) ఆ తర్వాత మీరు ఇచ్చిన వివరాలన్ని సరిగ్గా ఉన్నాయో లేదో మరోసారి చూసుకొని సబ్‌మిట్ చేయాలి.
4) ఒకవేళ మీరు ఇచ్చిన వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నట్లు గమనిస్తే ఆధార్ తో జత చేసిన మీ నెంబర్ కు OTP వస్తుంది, దాని ప్రకారంగా తిరిగి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా పొరపాటు జరిగినట్లు గుర్తిస్తే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి పరిష్కరించుకోవచ్చు.
ఎలా చేయాలో ఈ వీడియో చూడండి..
మరో మార్గం ద్వారా..
ఒకవేళ మీకు ఆన్‌లైన్ సదుపాయం లేనట్లయితే మీ ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపడం ద్వారా కూడా ఆధార్ -పాన్ లింక్ చేయవచ్చు. అయితే మీ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేయబడిన ఫోన్ నెంబర్ తో మాత్రమే ఈ ప్రక్రియ పూర్తి చేసే వీలుంటుంది. మెసేజ్ ఎలా చేయాలో కింద చూడండి.
1) మెసేజ్ లోకి వెళ్లి UIDPAN అని టైప్ చేసి దాని పక్కనే మీ 12 అంకెల ఆధార్ నెంబర్, దాని పక్కనే మీ 10 అంకెల పాన్ కార్డు నెంబర్ ను టైప్ చేయాలి
ఉదాహారణకు మీ ఆధార్ నెంబర్ 546738291083, పాన్ కార్డ్ నెంబర్ EFGH11234M అనుకుంటే, ఈ రకంగా UIDPAN 546738291083 EFGH11234M అని టైప్ చేయాలి.
2) ఆ తర్వాత 567678 లేదా 56161 ఏదో ఒక నెంబర్ కు మీ మెసేజ్ పంపండి.
3) మెసేజ్ పంపిన తర్వాత మీకు అక్కడ్నించి ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
ఏప్రిల్ 1 నుంచి ITR ఫైల్ చేయాలన్నా ఈ ఆధార్ కార్డ్- పాన్ కార్డ్ లింక్ తప్పనిసరి చేశారు.