No more relationship column in Aadhar Reports (Photo-Wikimedia Commons)

New Delhi, Febuary 10: ఆధార్ కార్డు (Aadhar Card) గురించి సోషల్ మీడియాలో ఓ వార్త ఇప్పుడు బాగా ట్రోల్ అవుతోంది. ఈ కథనం ప్రకారం ఇకపై ఆధార్ కార్డులో బంధుత్వాలు (Relationship) ఉండవు. అవేమి ఆధార్ కార్డులో కనిపించవు. ఇంతకు ముందు ఆధార్ కార్డ్‌లో సనాఫ్ అనో, డాటర్ ఆఫ్ అనో, లేకుంటే వైఫ్ ఆఫ్ తండ్రి పేరో లేకుంటే భర్త పేరో ఉంటుంది కదా? ఇక మీదట అవేమి లేకుండా ఆ రిలేషన్ స్థానంలో కేరాఫ్ అని రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. సెకన్లలో పాన్ కార్డు మీ చేతికి

ఇందులో భాగంగా సాఫ్ట్‌వేర్‌లో కొత్త అప్‌డేట్ తీసుకుని వచ్చిందని తెలుస్తోంది. దీని ప్రకారం కొత్త ఆధార్ కార్డ్ తీసుకోవాలని అనుకున్నా లేకుంటే ఆధార్ కార్డ్‌లో అప్ డేట్ చెయ్యాలి అనుకున్నా అదికేరాఫ్ అని మారిపోతుంది.

2020 మార్చి 30 లోపు ఆధార్ పాన్ లింక్ చేయాల్సిందే 

ఎన్నార్సీ (NRC) అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరికి వారే తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క ఆధార్‌లో మాత్రమే కాదు.. పాస్‌పోర్టులోనూ (Passport) ఇదే మార్పు రానుందని సమాచారం.

ఆధార్ కార్డ్‌తో పాన్ కార్డ్ లింక్ చేయడం ఎలా ?

కాగా పౌరసత్వం పొందాలంటే మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఆధార్‌ కార్డు, పాస్‌పోర్ట్‌లను ప్రామాణికంగా భావిస్తారు. ఈ రెండు డాక్యుమెంట్ల ఆధారంగానే భారత పౌరుడు అని సర్టిఫై చేస్తారు.

సోషల్ మీడియాకు ఆధార్ లింక్ అనుసంధానించే ఆలోచనేది లేదు

అయితే ఇప్పటివరకు ఆధార్‌లో బంధుత్వాల తొలగింపు కానీ కేరాఫ్‌ కొత్తగా చేర్చడానికి సంబంధించి కేంద్రం లేదా ఆధార్‌ సంస్థ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేవు. కేవలం సోషల్ మీడియాలో (Social Media) మాత్రమే వార్తలు వస్తున్నాయి.

కేవైసీ నిబంధనల్లో మార్పులు చేసిన ప్రభుత్వం

మరి ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. నిర్ణయం రాకముందే మనదేశంలో బంధుత్వాలకు, సంక్షేమ పథకాలకు అవినాభావ సంబంధం ఉందని, ఇప్పుడు ఈ కొత్త నిబంధనలతో కొంత ఇబ్బంది అయితే తప్పదని అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు.