PAN-Aadhaar linking deadline extended till March 2020: CBDT (Photo-File Image)

New Delhi, December 31: ఆధార్‌తో పాన్‌ కార్డు లింక్ (PAN-Aadhaar Linking) చేయలేదని భయపడుతున్నారా.. ఇకపై ఆ భయం అవసరం లేదు. ఆధార్‌తో (Aadhaar)పాన్‌ (PAN)వివరాలను లింక్‌ చేయని వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్స్ (సీబీడీటీ)(Central Board of Direct Taxes)శుభవార్త అందించింది. పాన్ - ఆధార్ లింకింగ్ తేదీని పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ సోమవారం రాత్రి ట్వీట్ చేసింది. నేటితో ముగియనున్న గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది.

ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139ఏఏ లోని ఉప-సెక్షన్ 2 కింద పేర్కొన్న విధంగా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి వచ్చే ఏడాది (2020) మార్చి 31వ తేదీ వరకు దీనిని పొడిగించింది. పాన్-ఆధార్ లింకింగ్‌ను ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సీబీడీటీ (CBDT) తాజాగా గడువును పొడిగించడం ఇది ఎనిమిదోసారి.

పాన్-ఆధార్ అనుసంధానం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కేంద్రం తప్పనిసరి చేసింది. ఇటీవల ఐటీ రిటర్న్స్ (IT Returns) దాఖలు చేసే వారికి తప్పనిసరి అయింది. డిసెంబర్ 31వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని ఐటీ శాఖ తెలిపింది.

Here's Income Tax India Tweet

ఆదాయప పన్ను శాఖ చేసిన ట్వీట్ ఇలా ఉంది

“ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139AA లోని సబ్ సెక్షన్ 2 కింద పేర్కొన్న విధంగా పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి గడువు తేదీని 2019 డిసెంబర్ 31 నుండి 2020 మార్చి 31 వరకు పొడిగించారు” అని తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ ఆదేశాల మేరకు, మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ను ఆధార్ కార్డుతో కనెక్ట్ చేయడం తప్పనిసరి.

పాన్ అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్య. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే ఆదాయపు పన్ను రిటర్న్ మీరు దాఖలు చేయలేరు. అంతేకాకుండా వారి పాన్ కూడా పనిచేయదు. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ-రిఫండ్ కూడా మీ ఖాతాలో జమ కాదు.