Trains Cancelled: హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలో వారం పాటు 20 రైళ్లు రద్దు.. నిర్వహణ పనుల కారణంగా రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించిన రైల్వే శాఖ
ఈ నెల 14 నుంచి 20 వరకూ 18 రైళ్లు, 15 నుంచి 21 తారీఖుల మధ్య మరో రెండు రైళ్లు రద్దు చేసినట్టు వివరించింది.
Hyderabad, Aug 13: హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో 20 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేసినట్టు రైల్వే శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 20 వరకూ 18 రైళ్లు, 15 నుంచి 21 తారీఖుల మధ్య మరో రెండు రైళ్లు రద్దు చేసినట్టు వివరించింది. నిర్వహణ పనులు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. హైదరాబాద్ లో ఈ నెల 14 నుంచి 20 వరకూ 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.
రద్దైన ప్రధాన రైళ్ల వివరాలు..
- కాజీపేట-డోర్నకల్-కాజీపేట
- డోర్నకల్-విజయవాడ-డోర్నకల్
- భద్రాచలంరోడ్-విజయవాడ-భద్రాచలంరోడ్
- కాజీపేట-సిర్పుర్‌టౌన్
- బళ్లార్ష-కాజీపేట
- భద్రాచలంరోడ్-బళ్లార్ష
- సిర్పుర్‌టౌన్-భద్రాచలంరోడ్
- సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్
- సిర్పుర్‌టౌన్-సికింద్రాబాద్-సిర్పుర్‌టౌన్
- కరీంనగర్-నిజామాబాద్-కరీంనగర్
- కాజీపేట-బళ్లార్ష-కాజీపేట
- కాచిగూడ-నిజామాబాద్-కాచిగూడ.