Trains Cancelled: విజయవాడ డివిజన్ లో భద్రతాపరమైన పనులు.. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు.. మరికొన్ని రైళ్లు నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా మళ్లింపు
నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా దారి మళ్లించారు.
Vijayawada, July 10: దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్ (Vijayawada Division) లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.
రద్దైన రైళ్ల వివరాలు..
- గుంటూరు-విశాఖపట్టణం(17239)
- విశాఖపట్టణం-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్
- కాకినాడ-విశాఖ-కాకినాడ (17267-17268)
- రాజమహేంద్రవరం-విశాఖ-రాజమహేంద్రవరం (07466-07467)
దారి మళ్లించనున్న రైళ్లు
- ధన్‌బాద్-అళప్పుల (13351) బొకారో ఎక్స్‌ప్రెస్
- హటియా-ఎస్ఎంబీ బెంగళూరు (12835)
- టాటానగర్-ఎస్‌ఎంవీ బెంగళూరు (12889)
- హటియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (18637)