Sankranti Special Trains: ప్రయాణికులకు శుభవార్త. మరో 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. నేటి నుంచే రిజర్వేషన్.. ఎక్కడికంటే??
ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన అధికారులు తాజాగా మరో 16 రైళ్లను ప్రకటించారు.
Hyderabad, Dec 31: ప్రయాణికులకు శుభవార్త (Good News). సంక్రాంతి (Sankranti) రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను (Special Trains) వరుసపెట్టి ప్రకటిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా మరో 16 రైళ్లను ప్రకటించారు. ఇవన్నీ తిరుపతి, వికారాబాద్, కాకినాడ టౌన్, కాచిగూడ, నర్సాపూర్, హైదరాబాద్, తిరుపతి నుంచి బయలుదేరుతాయి.
ఈ రైళ్లు జనవరి 7 నుంచి 18 వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. నేటి ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లు ప్రకటించినప్పటికీ రద్దీ ఇంకా విపరీతంగా ఉండడం, రిజర్వేషన్ల వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉండడంతో తాజాగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వెళ్లే ప్రయాణికుల కోసం ఈ రైళ్లు ప్రకటించింది.
సంక్రాంతికి మరో 30 ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్ నుంచి ఆంధ్రాలో పలు నగరాలకు రాకపోకలు