SSC Exam In Telugu: ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. ఇక తెలుగులోనూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష.. హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 స్థానిక భాషల్లోనూ పరీక్ష
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) పరీక్షను తెలుగులోనూ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పరీక్షను ఇప్పటి వరకు హిందీ, ఇంగ్లిష్‌లో నిర్వహిస్తుండగా, ఇకపై మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్టు చెబుతూ ప్రకటన విడుదలైంది.
Newdelhi, Jan 21: గ్రామీణ ప్రాంత ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ (Good News). స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) (Staff Selection Commission) పరీక్షను తెలుగులోనూ (Telugu) నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పరీక్షను ఇప్పటి వరకు హిందీ (Hindi), ఇంగ్లిష్‌లో (English) నిర్వహిస్తుండగా, ఇకపై మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నట్టు చెబుతూ ప్రకటన విడుదలైంది. వీటిలో తెలుగుతోపాటు ఉర్దూ, తమిళం, మలయాళం, కన్నడ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కొంకణి, మణిపురి, ఒడియా, మరాఠీ, పంజాబీ తదితర భాషలు ఉన్నట్టు ఎస్ఎస్‌సీ ప్రకటించింది.
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ .. లేబర్ పార్టీ ప్రకటన
కేవలం భాష కారణంగా ఉద్యోగావకాశాలు దూరం కాకూడదన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనలో భాగంగానే ఎస్ఎస్‌సీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఎస్ఎస్‌సీని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోని అభ్యర్థులందరికీ లాభం చేకూరుతుందన్నారు.