Chris Hipkins: న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్ కిన్స్ .. లేబర్ పార్టీ ప్రకటన
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా, జెసిండా ఆర్డెన్ స్థానాన్ని క్రిస్ హిప్ కిన్స్ భర్తీ చేయనున్నారు. ఈ మేరకు లేబర్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ ప్రస్తుత ప్రధానమంత్రి, లేబర్ పార్టీ నాయకురాలు జెసిండా ఆర్డెన్(42) ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం సంచలన ప్రకటన చేశారు
Wellington, January 21: న్యూజిలాండ్ (Newzealand) కొత్త ప్రధానిగా (New Prime Minister), జెసిండా ఆర్డెన్ స్థానాన్ని క్రిస్ హిప్ కిన్స్ (Chris Hipkins) భర్తీ చేయనున్నారు. ఈ మేరకు లేబర్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ ప్రస్తుత ప్రధానమంత్రి, లేబర్ పార్టీ నాయకురాలు జెసిండా ఆర్డెన్(42) ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం సంచలన ప్రకటన చేశారు.
ఫిబ్రవరి 7న ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుంటానని నేపియర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రధాని పదవికి న్యాయం చేయలేననే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగే సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపీగా కొనసాగుతానని తెలిపారు.
Chris Hipkins Set to Replace Jacinda Ardern as New Zealand's Prime Minister #ChrisHipkins #NewZealand @chrishipkins https://t.co/2WhQUJKwaj
— LatestLY (@latestly) January 21, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 21, 2023 08:43 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

