వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం, యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ మరోసారి భారత్ లో మెరుపులు మెరిపించేందుకు రెడీ అయ్యాడు. ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో తెలంగాణ టైగ‌ర్స్ జ‌ట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించనున్నాడు. ఈ విషయాన్ని ‍క్రిస్‌ గేల్‌ స్వయంగా వెల్లడించాడు. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి మార్చి 3 వ‌ర‌కు తొమ్మిది రోజుల పాటు డెహ్ర‌డూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ టోర్నీ జ‌రుగ‌నుంది.గేల్‌తో పాటు భారత మాజీ క్రికెటర్లు సుదీప్ త్యాగీ, మన్‌ప్రీత్ గోనీ, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రికార్డో పోవెల్‌ తెలంగాణ టైగర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు.

ఈ లీగ్‌లో మొత్తం ఆరు జ‌ట్లు భాగం కానున్నాయి. వీవీఐపీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, తెలంగాణ టైగ‌ర్స్‌, రాజ‌స్థాన్ లెజెండ్స్‌, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్ వారియ‌ర్స్‌, ముంబై ఛాంపియ‌న్స్ జట్లు ఈ వెటరన్‌ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్‌తో పాటు యూరోస్పోర్ట‌స్ ఛానెల్‌లో అభిమానులు వీక్షించవచ్చు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)