ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 ఆంథ‌మ్‌ను తాజాగా ఐసీసీ విడుద‌ల‌ చేసింది.గ్రామీ అవార్డు విజేత సీన్ పాల్, సోకా సూపర్ స్టార్ కేస్ టీ20 ప్రపంచకప్ అధికారిక గీతం 'అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్' ను రూపొందించారు. ఇక ఈ ఆంథ‌మ్ విడుద‌ల‌తో వరల్డ్కప్‌ వేడుకలు మొదలైపోయాయి.వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆంథ‌మ్‌ వీడియోలో ఎనిమిది సార్లు ఒలింపిక్ గోల్డ్‌ మెడల్‌ విజేత ఉసేన్ బోల్ట్, విండీస్ స్టార్ క్రికెట‌ర్లు క్రిస్ గేల్, అలీ ఖాన్, శివనారాయణ్ చంద్రపాల్, ఇతర కరేబియన్ ప్రముఖులు కనిపించారు. మ్యూజిక్ వీడియోలో వాళ్లంతా క్రికెట్‌ని సెలబ్రేట్‌ చేసుకుంటూ కనిపించారు.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను చూడటానికి అభిమానులు వెళ్లినప్పుడు కలిగే వినోదం, ఉత్సాహాన్ని వీడియో చూపిస్తుంది. జూన్ 2 నుంచి 29 వ‌ర‌కు అమెరికా, వెస్టిండీస్‌లో ఈ టోర్నీ నిర్వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి 20 జ‌ట్లు పాల్గొంటున్న ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో మొత్తం 55 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. టీమిండియా త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడ‌నుంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)