Telangana Rain Update: తెలంగాణను వదలని వర్షాలు.. రానున్న మరో ఐదురోజులు వర్షాలు.. 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ మేరకు మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతా వరణ శాఖ తెలిపింది.
Hyderabad, Sep 3: భారీ వర్షాలతో (Heavy Rains) అతలాకుతలం అయిన తెలంగాణను (Telangana) రానున్న మరో ఐదు రోజులపాటు వర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ మేరకు మంగళవారం నుంచి రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతా వరణ శాఖ తెలిపింది. ఈ నెల 5నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, ఆయా జిల్లా కలెక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు. భారీ వర్షాల కారణంగా టీజీఎస్‌ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 1447 బస్సు సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపింది. ఆదివారం రాత్రి వరకు 877, సోమవారం ఉద యం నుంచి మరో 570 బస్సులను రద్దు చేసింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జన గామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వాన లు కురిసే అవకాశముందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో జల ప్రళయం, రూ. 5 లక్షలు విరాళం ప్రకటించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు