Traffic Restrictions in Hyderabad: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం.. హైదరాబాద్‌ లో నేడు, రేపు ట్రాఫ్రిక్‌ ఆంక్షలు

ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి.

traffic Hyderabad (Credits: X)

Hyderabad, June 1: తెలంగాణ రాష్ట్ర అవతరణ (Telangana Formation Day) దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వంతోపాటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ (BRS) వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్సవాలు జరుగనుండగా, బీఆర్‌ఎస్‌ మూడు రోజులపాటు వేడుకలను నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోని ట్యాంక్‌ బండ్, గన్‌ పార్క్, పరేడ్ గ్రౌండ్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

ప్రారంభమైన చివరి విడుత ఎన్నికల పోలింగ్.. 57 లోక్‌ సభ స్థానాలకు కొనసాగుతున్న ఓటింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.06 కోట్ల మంది.. ఈ విడతలో బరిలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు.. సాయంత్రం 6.30 గంటలకు రానున్న ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజలు

ఆంక్షలు ఇలా..

ట్యాంక్‌ బండ్‌ పై శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రి 12 గంటల వరకు, గన్‌ పార్క్ వద్ద ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరేడ్ గ్రౌండ్స్  పరిసరాల్లో వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. ఎల్‌పీజీ వాణిజ్య సిలిండర్ ధరపై రూ. 69.50 తగ్గింపు.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లు యథాతథం