Arjita Seva Tickets: జనవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపే విడుదల.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు.. వెల్లడించిన టీటీడీ

మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

File (Credits: Twitter/TTD)

Tirupati, Dec 11: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జనవరి మాసం కోటాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో వివరించింది. అంతేకాకుండా, జనవరి నెలకు సంబంధించిన మరికొన్ని ఆర్జిత సేవా టికెట్ల ఆన్ లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 12 ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 14న ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుందని వివరించింది. అనంతరం లక్కీ డిప్ ద్వారా టికెట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది.

ఏపీని అల్లకల్లోలం చేసిన మాండౌస్ తుపాను.. నేడు కూడా వర్షాలు.. అధికారుల అలర్ట్.. ఇప్పటికే వేలాది ఎకరాల్లోని పంటలు వర్షంపాలు